ఫస్ట్ ఇంటర్ పరీక్షలో ఫెయిల్ అయి మానసిక వ్యధతో ఐదు మంది, సెకెండ్ ఇంటర్‌లో ఫెయిల్ అయి ఓ ఐదుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈవిధంగా ఆత్మహత్యలకు పాల్పడటంవల్ల కలిగే తల్లిదండ్రుల గర్భశోకం ఎవరు తీర్చగలరు? ర్యాంకులకోసం విద్యా ర్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారన్నది జగమెరిగిన సత్యం.













