లోక్‌సభ సమావేశాలు షష్టి పూర్తిచేసుకున్నాయి. అరవై ఏళ్లకే కుర్రాళ్లైపోయి-యిరవై ఏళ్ల కుర్రాళ్లల్లాగ ఎంపీలంతా సంబరాలు చేసుకున్నారు.
వీరాజీయం
లోక్‌సభ సమావేశాలు షష్టి పూర్తిచేసుకున్నాయి. అరవై ఏళ్లకే కుర్రాళ్లైపోయి-యిరవై ఏళ్ల కుర్రాళ్లల్లాగ ఎంపీలంతా సంబరాలు చేసుకున్నారు.
ప్రతి దానికీ సి.బి.ఐ. ఎంక్వయిరీవే! రాజకీయ నాయకుడైతే చాలు- అవినీతి బురదలో యిరుక్కుపోయి కనబడతాడు. జైలుకీ-బైలుకీ మధ్య- కోర్టుకీ, కటకటాలకీ మధ్య- టెన్నిస్ బంతిలాగ కొట్టుకుంటూ దర్శనం యిస్తున్నాడు.
‘‘రాష్టప్రతి ఎవరైతే నీకేం? నీకు అక్కడ వోటు లేదుకదా?’’ అన్నాడో వోటర్- మరో సిటిజన్‌తో- ‘‘అఫ్‌కోర్స్!’’ అన్నాడు అవతలి పెద్దమనిషి.
‘మొండివాడు రాజుకన్నా బలవంతుడు’- అంటారు. పాకిస్తాన్ దేశాన్ని ప్రధానిగా పరిపాలిస్తున్న యుసఫ్ రజా గిలానీ రాజు కాడు కానీ-రాజుకన్నా బలవంతుడు-మొండివాడు. సుప్రీంకోర్టుతోనే లడాయికి దిగాడు.
అంతరిక్షంలో భూమి చుట్టూ గిరికీలు కొట్టే కృత్రిమ ఉపగ్రహాల్ని- చైనా, తల్చుకుంటే తుత్తునియలు చేసేస్తుంది- చైనా దగ్గర ఖండాంతర వేధులున్నాయి- వేలాది.
ప్రధమంగా మన సువిశాల భారతానికి వో మహిళా రత్నం-సుప్రీం కమాండర్ అయింది. రాష్టప్రతి అంటే, రాజేంద్రప్రసాద్‌గారి దగ్గర్నుంచీ- అబ్దుల్‌కలామ్ గారి దాకా ఎందరో మహానుభావులు గుర్తొస్తారు.
మమతా దీదీకి- కార్ల్‌మార్క్స్ అంటే- మమతా, మమకారం ఉంటాయని అనుకునే- ‘ఎంబెమ్మ’ ఎవ్వడూ వుండడు కానీ, ఈ జెర్మనీ ప్రొఫెసర్‌ని- పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి - ‘‘గెట్ అవుటాఫ్ క్లాస్‌రూమ్’’ అంటుందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ- అంటే అభిమానం వున్న స్కూల్ టీచర్‌లు కూడా అనుకోలేదు- కానీ, మార్క్స్‌గారు యిప్పుడు- ‘పెర
తెల్లారేసరికి అన్నీ ప్రశ్నార్థకాలే! అసలీ క్వశ్చన్ మార్కుల్లోనే పరమార్థం అంతా వున్నట్లుగా వుంది. రెండు రోజుల్లో తెలంగాణా మీద ఒక ప్రకటన ఆ ‘ప్రకటన’ మాట అంతటితో ఆగదు. దాని చివరలో ఓ ‘హుక్కు’ అంటే వో క్వశ్చన్ మార్కు వుంటుంది.
దిక్కుమాలిన పవర్ కట్!’’ నా సెల్‌ఫోన్ ఛార్జీ పడిపోయినప్పుడే పోయి చావాలీ? ఇంక రెండు గంటలు చెక్క భజనే!’’ అంటూ విసుక్కుంటున్నదో ఉద్యోగిని.
అన్ని దిక్కులా వెల్లివిరిసిన ఇంద్రధనస్సు! 369 రోజులుగా ‘సచిన్’మాట ఎలా వున్నా-ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా ఉపఖండంలో అందునా పవిత్ర భారతదేశంలో క్రికెట్ ప్రియులంతా ఆమాటకోస్తే యావన్మంది భారతీయులు ఎదురు చూస్తూ వున్న చరిత్రాత్మకమైన మహా మనోజ్ఞ మన్‌మోహన సంఘటన భళ్ళున ఉదయించింది.