మేధ మెయిన్ ఫీచర్

21/05/2012

మనిషి... ఆరడుగుల ఎ త్తున్న మరో మనిషిని నమ్మడు. అంగుళం తాళాన్ని మాత్రం నమ్ముతాడు. అంతకన్నా ఎక్కువగా తన కుక్కను నమ్ముతాడు. మనిషి జాతికి మరో జంతువు గురించి పట్టనప్పటినుంచి కుక్క తోడుగా ఉంది. పదిహేను వేల సంవత్సరాల క్రితం అంటే వ్యవసాయం కూడా అంతగా రాని నాటినుంచే కుక్కలు సాయంగా వచ్చాయి.

14/05/2012

ఆది మానవుడు, రాతియుగాలు, పాత బతుకుల గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. తెలుసుకోవాలన్న ప్రయత్నం మాత్రం సాగుతూనే ఉంది. మానవ జాతి మరింత కాలం కొనసాగుతుంది. రానున్న కాలానికి మనం ‘గతం’లో ఉంటాము. మన ప్రస్తుతపు బతుకుల గురించి, ఆ తరాలకు తెలియగలిగిన సమాచారం గురించి ఆలోచనలు మొదలయినయి.

07/05/2012

భూమి పుట్టిన చాలా కాలానికి గానీ మనిషి జాతి పుట్టలేదు. మనమూ మన జాతి పోయిన తరువాత కూడా భూమి ఉంటుంది. అది మారుతూ వచ్చింది. ఆ మార్పులోనే మనిషి జాతి కూడా వచ్చింది. భూమి మారుతూనే ఉంటుంది. మనుషులనే మనము ఆ మార్పులను మరోవేపు మరల్చి, మరింత వేగవంతం చేశాము.

30/04/2012

ఆలోచనలున్నాయని తెలుసు. వాటిని మన పద్ధతిలో నడిపించవచ్చునని మాత్రం తెలియదు. సైన్సు ఉందని తెలుసు. దాన్ని గురించి ఆలోచించడం మాత్రం తెలియదు. అసలు ఆలోచనలన్నీ సైన్సు పద్ధతిలో నడవవచ్చునని మనకు అసలే తెలియదు. నిత్యం బతుకుదారిలో ప్రతి పనికీ కారణాలు, పద్ధతులు మనకు తెలియకుండానే వెదుకుతాం.

23/04/2012

ఈ ఫ్రపంచంలో ఉండే జీవరాశులన్నింటినీ తెచ్చి ఒక చోట కుప్ప పోస్తే, అందులో పావు వంతు మనుషులు ఉంటారు. ఆశ్చర్యంగా మరోపావు వంతు చీమలుంటాయి. చీమలంత విజయవంతంగా బతికే జీవి మరొకటి లేదంటారు ప్రకృతి పరిశీలకులు. ఈ ప్రపంచంలో ఒక్క అంటార్కిటికాలో తప్ప మిగతా అన్ని చోట్లా చీమలున్నాయి.

16/04/2012

మన సూర్యుడిని ఒంటరి నక్షత్రం అంటుంటారు. సూర్యుడి కాంతి దగ్గరలోని మరో నక్షత్రానికి చేరడానికి నాలుగు సంవత్సరాలు పడుతుంది. అలాగని సూర్యుడు మొదటి నుంచీ ఒంటరి నక్షత్రమేనా? సుమారు నాలుగున్నర బిలియన్ సంవత్సరాల నాడు ఈ సూర్యుడు దుమ్ము, వాయువులు కలిగిన ఒక మేఘం నుంచి పుట్టిన సంగతి తెలుసు.

09/04/2012

మీకు అంతకుముందు వెర్రి లేకున్నా ‘కొలవెరి’ పాట విన్న తరువాత కొంతయినా పుట్టి ఉండాలి. కొల అంటే హత్య. వెర్రి అంటే వెర్రి, పిచ్చి, తిక్క, వగైరా.. వగైరా! ఈ వెర్రి, పిచ్చి, తిక్కలను ఇంగ్లీషులో లూనసీ అంటారని తెలిసే ఉండవచ్చు. అంటే చంద్రుడికీ తిక్క ముదరడానికీ ఏదో సంబంధం ఉందని ఈమాట ద్వారా ధ్వనిస్తుంది.

02/04/2012

సైన్సు.. పుస్తకాలలో ఉంటుందని, అది అందరికీ సులభంగా అర్థం కాదనీ, పరిశోధకులు మొదలు, పిల్లలదాకా, అందరూ అనుకుంటారు. సైన్సును సైన్సుగా గుర్తించకముందు కూడా బతుకు, తెలివి ఉన్నాయి. కనుక పరిశీలన కూడా ఉంది. అవగాహన సరిగా లేదు గనుక, అదంతా అంధకార యుగమనీ, ఆల్కెమీ యుగమని కూడా అందరూ అనుకుంటారు.

26/03/2012

‘సైన్సును సమాజంలోకి తీసుకుపోతున్నాము’-అన్నారొక పెద్దాయన. నిజమే. ఆ అవసరం చాలా ఉందనిపించింది, ఆ మాట వినగానే. ఆయనగారికి తెలిసిన సైన్సు, అలాంటి వారంతా చేస్తున్న సైన్సు, అందరికీ పట్టదు. అంత సులభంగా అర్థం కాదు. ఆ సైన్సును ఆయనగారు అరటిపండు గుజ్జులాగా చేసి మన ముందు ఉంచినా, మనకు అదేమిటో అంతుపట్టదు.

19/03/2012

‘‘సముద్రంలో తిమింగలాలు, అడవుల్లో పాండాలు అంతరించిపోయాయంటే అది ఘోరమయిన విషయమే. కానీ, వాటితోబాటు ప్రపంచం మాత్రం ముగిసిపోలేదు. కానీ అమోనియాను ఆక్సీకరణం చెందించడానికి చేతనయిన రెండు జాతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అవి రెండూ అంతరించిపోతున్నాయంటే, అది మరో రకం పరిస్థితి.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading