మేధ తెలుసుకుందాం

21/05/2012

రెండురకాల కారణాలకు కంటిపాప ఎక్కువగా తెరచుకుని, ఎక్కువ కాంతిని లోనికి వదులుతుంది. చీకటిగా ఉన్నప్పుడు, నొప్పి కలిగినప్పుడు అది తెరచుకుంటే దాన్ని శారీరక కారణం అనవచ్చు. కళ్లు విప్పారడానికి మానసిక కారణాలు కూడా ఉన్నాయి.

14/05/2012

రొట్టె పిండి తడిపి పెట్టాము. దాన్ని అరచేతితో అదుముతున్నాము. అది మన చేతిదారినుంచి తప్పుకోవాలి. కనుక అదిమిన కొద్దీ పక్కకు సాగుతుంది. రాను రాను పలచనవుతుంది. ఇక అరచేతితో కాకుండా అడ్డంగా చేతి అంచుతో అదుముతున్నామనుకుందాం. కరాటే పద్ధతిలో కొడుతున్నాము. కానీ, నెమ్మదిగా కొడుతున్నాము.

07/05/2012

సూటిగా చెప్పాలంటే అవసరమయినదీ, అనుకున్నదీ జరిగితేనే అదృష్టం. క్రికెట్‌లో టాస్ పేరున కాయిన్ ఎగరేస్తారు. అది కిందపడితే అదృష్టం కాదు. అది గురుత్వాకర్షణ మాత్రమే. బొమ్మ, బొరుసు అని నాణానికి రెండు ముఖాలు. వాటిలో మనం అడిగింది పడితే అదృష్టం.

30/04/2012

23 ఏప్రిల్, 1858న పుట్టిన మాక్స్ ప్లాంక్ భౌతిక శాస్త్ర రంగానికి పునాదులు వేసినవారిలో ముఖ్యుడు. క్వాంటం సిద్ధాంతానికి అతనే శ్రీకారం చుట్టాడు. అణువు, పరమాణువుల పని తీరు ఈ సిద్ధాంతంతో ఎంతో మారింది. 20వ శతాబ్దపు సిద్ధాంతాలలో చాలా ముఖ్యమయిన సిద్ధాంతమిది.

30/04/2012

గురక: చాలామంది పక్కవారిని ‘గురక పెడతారని’ అంటారు. తమ గురక తమకు తెలియదుగా! మనలో సుమారు సగంమంది గురక పెడతారు. అయితే మగవాళ్లు ఎక్కువగా గురక పెడతారు. మగవాళ్లలో అరవయి శాతం, ఆడవాళ్లలో నలభయి శాతం ఈ సమస్యకు తలవంచేవారేనని లెక్క తేలింది. నలభయి నుంచి అరవయి అయిదు మధ్య వయసుగలవారిలో గురక ఎక్కువ.

23/04/2012

*న్యూజీలాండ్‌లో 26 మిలియన్ సంవత్సరాలనాడు బతికిన పెంగ్విన్‌లు 1.3 మీటర్ల ఎత్తు ఉండేవి. అంటే ఇప్పటి ఎంపరర్ పెంగ్విన్‌ల కన్నా 0.3 మీటర్లు ఎత్తు!

16/04/2012

కంప్యూటర్లు - కళ్లు మంట:

09/04/2012

బెలూగా జాతి తెల్ల తిమింగలాలు మాంసాహారులు. యూరపు, ఆసియా, ఉత్తర అమెరికాల ఉత్తర తీర ప్రాంతాలలో ఇవి ఉంటాయి. పుట్టినప్పుడు ముదురు రంగులో ఉండే వీటి చర్మం అయిదు సంవత్సరాల వయసు నాటికి మీగడ తెలుపుగా మారుతుంది. ఆర్కిటిక్ చలికి తట్టుకోవాలి గనుక వీటి చర్మం మందంగా ఉంటుంది.

02/04/2012

ఆమ్‌స్టర్‌డాంలోని ఆర్టిస్ జంతు ప్రదర్శనశాలలో ఒక ఆసియా ఏనుగు ఉంది. దానిపేరు విన్ తిడా. విన్ మిగతా ఏనుగులతో ఆడుతూ ఉంటే, కంటిలో దెబ్బతగిలింది. జూ అధికారులకు ఏం చికిత్స చేయాలో తోచలేదు. ఆయింట్‌మెంట్లు, మాత్రలు ఏవీ పనిచేయలేదు. ఏనుగుకు ఆ కంటిని తెరిచి ఉంచడమే కష్టమయిపోయింది.

26/03/2012

19,00,00,000 (పందొమ్మిదికోట్లు): దక్షిణ ఆఫ్రికాలో డైనొసార్ల గూళ్లు దొరికాయి. దొరికింది ఏమయినా, వాటికి ప్రాముఖ్యం ఎక్కువ. ఇంతకు ముందు దొరికిన గూళ్లన్నిటికన్నా ఇవి పందొమ్మిది కోట్ల సంవత్సరాలు పాతవి. అంటే రాక్షసి బల్లులు అనుకున్నదానికి చాలా చాలా పాతకాలం జంతువులని అర్థం అంటున్నారు పరిశోధకులు.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading