జాతీయ వార్తలు

31/10/2014

ముంబయి: మహారాష్ట్ర తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా దేవేంద్ర గంగాధర్ రావు ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ విద్యాసాగర్ రావు ఆయన చేత ప్రమాణం చేయించారు.

31/10/2014

న్యూఢిల్లీ: విద్యుత్ విషయంలో తెలంగాణ తెలుగుదేశం నేతలు కేంద్ర మంత్రులను కలువకుండా తమ అధినేత చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేస్తే బాగుండేదని తెలంగాణ ఐటి మంత్రి కేటిఆర్ అన్నారు. విద్యుత్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆయన కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, రవిచంద్రప్రసాద్‌లను కలిసి విజ్ఞప్తి చేశారు.

31/10/2014

న్యూఢిల్లీ:శీతాకాలం వచ్చినందున ఇళ్లులేని నిరుపేదలకు షెల్టర్లు నిర్మించాలని సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలలో ఈ షెల్టర్లు నిర్మించకపోతే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

31/10/2014

బెంగళూరు: బెంగళూరులో మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ది ఇందిరానగర్ కేంబ్రిడ్జ్ పాఠశాలలో చదువుతున్న ఆరేళ్ల బాలికపై ఓ ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పదిరోజుల క్రితమే ఈ దారుణం జరిగినప్పటికీ నేడు వెలుగులోకి వచ్చింది. ఆగ్రహం చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

31/10/2014

ముంబయి: ప్రకాశం జిల్లాకు చెందిన ఆంధ్రా బ్యాంక్ అధికారి సుబ్బారావుపై శుక్రవారం ఉదయం ముంబయి రైల్వేస్టేషన్ సమీపంలో దుండగులు దాడి చేసి సుమారు 5 లక్షల రూపాయలను దోచుకెళ్లారు. దాడిలో గాయపడిన సుబ్బారావును చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలించారు.

31/10/2014

ఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో నిందితులైన కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా, డిఎంకె ఎం.పీ కనిమొళిపై అభియోగాలు నమోదయ్యాయి. ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు నిందితులపై కేసులు నమోదు చేసింది. ఈ ఇద్దరితోపాటు డిఎంకె అధ్యక్షుడు కరుణానిధి, ఆయన భార్య దయాళ్ అమ్మాళ్, మరో 14మంది పై అభియోగాలు నమోదు చేశారు.

31/10/2014

అహ్మదాబాద్: గుజరాత్‌పై ప్రభావం చూపుతుందని భావించిన నిలోఫర్ తుపాను క్రమంగా బలహీనపడింది. శుక్రవారం సాయంత్రం తక్కువ తీవ్రతతో తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని భావిస్తున్నారు.

31/10/2014

ఢిల్లీ: భారత జాతిని సమైక్యంగా ఉంచటంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి చిరస్మరణీయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పటేల్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద జాతీయ ఐక్యతా పరుగును శుక్రవారం ఆయన ప్రారంభించారు.

31/10/2014

ఢిల్లీ: దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 30వ వర్థంతి సందర్భంగా ఢిల్లీలోని శక్తిస్థల్ వద్ద రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆ పార్టీ యువ నేత రాహుల్‌గాంధీ ఘనంగా నివాళులర్పించారు.

31/10/2014

ఢిల్లీ: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా దేశ రాజధానిలో రాష్టప్రతిభవన్ వద్ద సమైక్యతా పరుగును నిర్వహించారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ జెండా ఊపి దీన్ని ప్రారంభించారు.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading