నేడు దేశంలోని నిర్మాణరంగంలో అనూహ్యమైన మార్పులొచ్చాయి. పట్టణీకరణ ప్రభావంతో బహుళ అంతస్థుల భవన నిర్మాణాలు అందుబాటులోకి వచ్చాయి. అపార్టుమెంట్లు, మల్టీప్లెక్స్ థియేటర్లు, ఐటి పార్కులు, సూపర్ మార్కెట్లు, టౌన్‌షిప్‌ల నిర్మాణం జోరందుకున్నందున ఈ రంగంలో అభివృద్ధి గణనీయంగా పెరిగింది.












