న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: భారత జట్టులో ఉన్న విభేదాలను పరిష్కరించడానికి బిసిసిఐ రంగంలోకి దిగాలని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ కోరాడు. రొటేషన్ విధానాన్ని కేవలం ముగ్గురు టాప్‌ఆర్డర్ ఆటగాళ్లకే అమలు చేస్తుండటంతో జట్టులో అభిప్రాయభేదాలు ఏర్పడినట్టు ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయ.







