రాష్ట్ర వార్తలు

23/02/2012

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 22: శ్రీకాళహస్తిలో జరుగుతున్న శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో బుధవారం ఉదయం అధికారనంది, కామధేను వాహనాలపైనా, రాత్రి సింహ, గజ వాహనాలపైనా స్వామి, అమ్మవార్లు ఊరేగారు.

23/02/2012

హైదరాబాద్, ఫిబ్రవరి 22: వైఎస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ తన విచారణ ముమ్మరం చేసింది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అనుమతుల మంజూరు, జివోల విడుదల, పలు కంపెనీలకు భూ కేటాయింపుల వంటి కీలక అంశాలతో సంబంధం ఉన్న అధికారులపై సిబిఐ క్షుణ్ణంగా పరిశోధిస్తోంది.

23/02/2012

హైదరాబాద్, ఫిబ్రవరి 22: జగన్ కేసులో ఒఎంసి కేసు నిందితులు శ్రీలక్ష్మి, రాజగోపాల్‌ను విచారించేందుకు తమ కస్టడీకి అనుమతించాలన్న సిబిఐ విజ్ఞప్తిని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం తిరస్కరించింది. సిబిఐ పేర్కొన్న కారణాల్లో స్పష్టత లేదని కోర్టు అభిప్రాయపడింది.

23/02/2012

రాజమండ్రి, ఫిబ్రవరి 22: పొగాకు బోర్డు అనుమతించిన పొగాకు పంట పరిమాణం కన్నా అదనంగా దిగుబడి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరికి ముందు వరకు ఉన్న వాతావరణ పరిస్థితుల కారణంగా దిగుబడి బాగా తగ్గుతుందని భావించినప్పటికీ, తరువాత వాతావరణంలోని మార్పుల కారణంగా దిగుబడి బాగా పెరిగింది.

23/02/2012

విశాఖపట్నం, ఫిబ్రవరి 22: ఆసియాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని విశాఖపట్నం రైల్వేజోన్ సాధన సమితి ప్రతినిధులు పార్లమెంటరీ రైల్వే స్టాండింగ్ కమిటీకి బుధవారం వినతిపత్రం సమర్పించారు.

23/02/2012

హైదరాబాద్, ఫిబ్రవరి 22: నందమూరి తారక రామారావు 2011 సంవత్సరం రంగస్థల పురస్కారానికిగానూ ప్రముఖ రంగ స్థల నటుడు, ప్రయోక్త, గుంటూరు జిల్లాకు చెందిన కెఎస్‌టి శాయిని ఎంపిక చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని సమాచార శాఖ మంత్రి డికె అరుణ తెలిపారు.

23/02/2012

కరీంనగర్, ఫిబ్రవరి 22: ఉభయ కమ్యూనిస్టు పార్టీలైన సిపిఐ, సిపిఎంల మధ్య ఎలాంటి విబేధాలు లేవని, ఇవి పూర్తిగా మీడియా కల్పితాలేనని భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎ.బి.బర్ధన్ స్పష్టం చేశారు.

23/02/2012

తిరుపతి, ఫిబ్రవరి 22: ధూప, దీప, నైవేద్యాలతో ఆలయ గోడలు దెబ్బతినే అవకాశాలు ఉన్నందున, అందుకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టిటిడి యాజమాన్యానికి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చామని భారత పురావస్తు శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ మణి తెలిపారు.

23/02/2012

హైదరాబాద్, ఫిబ్రవరి 22: నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పేరును ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు.

23/02/2012

బొబ్బిలి, ఫిబ్రవరి 22: విజయనగరం జిల్లా బొబ్బిలిలో బుధవారం కవలలు సందడి చేశారు. వీరి భావాలు, అభిప్రాయాలు, ఆశయాలు దాదాపు ఒకేలా ఉండటం పరిపాటి. ఇటువంటి కవలలను ఒకే వేదికపైకి తేవడం గొప్ప విషయమే. 1976లో ఫిబ్రవరి 22న పోలెండ్ దేశస్థులు కవలల దినోత్సవాన్ని నిర్వహించారు.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading