మంచి మాట

21/05/2012

మనిషి ఎప్పుడో ఒక్కసారి కాలగర్భంలో కలిసిపోక తప్పదు. చావు పుట్టుకలు దైవనిర్ణయాలు. పునరపి జననం, పునరపి మరణం, దైవం ఆడించే జగన్నాటకం ఇది ఒక మాయా జనితం. ఈ జగన్నాటకంలో అందరూ పాత్రధారులే. ఇందులో ఏ ఒక్కరికీ మినహాయింపు లేదు.

20/05/2012

జీవునకు జనన, మరణ జరా వ్యాధులు ఆపాదింపబడి ఉంటాయి. వీటినుంచి ఏ వ్యక్తి తప్పించుకోవటం వీలుకాదు. జీవాత్మకు భౌతిక ప్రకృతితో ఏర్పడిన సంపర్కం వలననూ తాను భగవానునితో ఐక్యత కలవాడేనని అతడు విస్మరించడం మూలంగాను మనిషి వీటికి గురువుతున్నాడు.

19/05/2012

మనిషి అనేవాడు తప్పులు చేయడం సహజం. పుట్టుకతోనే తప్పులు పుట్టుకురావు. అయితే గర్భస్థ శిశువుగా తన పూర్వజన్మకు చెందిన తప్పొప్పులను జ్ఞప్తికి తెచ్చుకుని పశ్చాత్తప చిత్తంతో రోదిస్తూ భగవంతుని శరణు వేడుకుంటున్నాడు.

17/05/2012

వర్తమానంలో వ్యక్తులంతా ‘నేను’, ‘నాది’ అనే చట్రంలో ఇమిడిపోయి స్వార్థపరత్వంలో జీవిస్తున్నారు. ‘నాకేమిస్తావు’ అని అడుగుతున్న మనిషి ఇతరులకోసం తానేమి చేయగలడో ఆలోచించటం లేదు. స్వామీజీలను పూజిస్తున్నా.. బాబాలను ఆశ్రయిస్తున్నా..

16/05/2012

సంపదలవల్ల సత్కర్మాచరణ, శక్తివల్ల కార్యసాధన, కీర్తివల్ల నిత్యస్ఫూర్తి, ప్రతిభవల్ల శ్రేయస్సు, జ్ఞానంవల్ల ఆత్మసాక్షాత్కారం కలుగుతాయన్నారు జగద్గురువు శ్రీ శంకరాచార్యులు.

15/05/2012

వైశాఖ మాసంలో పూర్వాభాద్ర నక్షత్రంలో బహుళ దశమి శనివారం విష్ణ్భుక్తుడైన ఆంజనేయుని జననం జరిగిందని ‘పరాశర సంహిత’లో ప్రస్తావించబడినది. ఈ రోజున పల్లెలు, పట్టణాలు అను భేదం లేకుండా అన్ని వర్ణములవారు స్ర్తి పురుష భేదం లేకుండా ఆలయాలలో, దేశం నలుమూలలా ‘హనుమజ్జయంతి’ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు.

14/05/2012

ఆంజనేయస్వామివారు వైశాఖ బహుళ దశమి పూర్వాషాఢ నక్షత్ర దినమున వాయుదేవుని వర ప్రభావమున కేసరీ, అంజనాదేవిఅను దంపతులకు కుమారుడిగా జన్మించారు. తల్లి అంజనాదేవి అభీష్టము ప్రకారం సూర్యభగవానుని వద్ద నవవ్యాకరణాలు, సమస్త శాస్త్రాలు నేర్చుకొని బుద్ధిమంతులలో శ్రేష్ఠుడుగా శ్రీ మద్రామాయణమున ప్రశస్తి పొందాడు.

13/05/2012

శ్రీరాముడి పేరు వినపడగానే ధర్మస్వరూపం కళ్ళఎదుట కనిపిస్తుంది. సత్యహరిశ్చంద్రుడి పేరు చెవిలో పడినంతనే సత్యనిష్ఠ మదిలో మెదులుతుంది. భగీరథుడి పేరు శ్రవణేంద్రియానికి తాకినంతనే పట్టుదల స్ఫురిస్తుంది. పేరులో ఉండే మహత్వం అట్టిది.

12/05/2012

జీవితంలో పోరాటం అనేది సహజం. ఈ జీవన సమరంలో విజయం సాధించి బతుకుపై ఆధిపత్యాన్ని చెలాయించేందుకు ప్రతి ఒక్కరు తీవ్రంగా ప్రయత్నిస్తూంటారు. అయితే ఈ ప్రయత్నంలో సఫలీకృతులైనవారెవరూ మనకు కనిపించరు. మన జీవితాలలో జరిగే పలు సంఘటనలను మనం మార్చలేము.

10/05/2012

తృప్తి అన్నది మనిషికి ఆనందాన్ని ఇస్తుంది. కోరికలుఎన్నైనా ఉండవచ్చు. అన్నీ తీరవు. దానికి బాధపడే కంటే ఉన్నదానిలో ఆనదాన్ని అనుభవించగలగడం అన్నది ఓ వరం. అందుకే తృప్తి కలవాడు గొప్ప ఐశ్వర్యవంతుడు అంటారు.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading