పరధనముల్ హరించి, పరభామల నంటి, పరాన్న మబ్బినన్
మురిపము కాని, మీదనగు మోసమెరుంగదు మానసంబు, దు
స్తరమిది, కాలకింకర గదాహతి పాల్పడనీక మమ్ము నే
తరి దరిజేర్చి కాచెదవో? దాశరథీ కరుణాపయోనిధీ
నేర్చుకుందాం
పరధనముల్ హరించి, పరభామల నంటి, పరాన్న మబ్బినన్
మురిపము కాని, మీదనగు మోసమెరుంగదు మానసంబు, దు
స్తరమిది, కాలకింకర గదాహతి పాల్పడనీక మమ్ము నే
తరి దరిజేర్చి కాచెదవో? దాశరథీ కరుణాపయోనిధీ
నేనొరించు పాపముల నేకములైనను నాదు జిహ్వకున్
బానకమయ్యె మీ పరమ పావన నామము దొంటి చిల్క’రా
మా , నను గావు’మన్న తుదిమాటకు సద్గతి జెందె గావునన్
దాని ధరింప గోరెదను దాశరథీ కరుణాపయోనిధీ
అగణిత జన్మ కర్మ దురితాంబుధిలో బహు దుఃఖ వీచికల్
దెగిపడ, నీడలేక, జగతీ ధవ నీ పదభక్తి నావచే
దగిలి తరింప గోరితి బదంపడి నాదు భయంబు మాన్పవే
తగదని చిత్తమందిడక దాశరథీ కరుణాపయోనిధీ
పాపము లొందువేళ రణపన్నగ భూత భయ జ్వరాదులం
దాపదనొందువేళ, భరతాగ్రజ మిమ్ము భజించువారికిం
బ్రాపుగ నీవు దమ్ముడిరు ప్రక్కియలం జని తద్విపత్తి సం
తాపము మాని; కాతురట, దాశరథీ కరుణాపయోనిధీ
జనవర, మా కథాళి వినసైపక కర్ణములందు ఘంటికా
నినదవినోదముల్ సలుపు నీచునకున్ వరమిచ్చినావు నీ
న్ననయము నమ్మి కొల్చిన మహాత్ముల కేమి యొసంగెదో సనం
దనసుత, మాకొసంగుమయ దాశరథీ కరుణాపయోనిధీ
కలియుగ గమర్త్యకోటి నిను కన్గొనరాని విధంబొ, భక్త వ
త్సలతవహింపవో, చటుల సాంద్ర విపద్ద శవార్ది గ్రుంకుచో
బిలచిన పల్క వింత మరసే నరులిట్ల నరాదు గాక నీ
తలపున లేదె సీత చెర దాశరధీ కరుణాపయోనిధీ
గద్దరియోగి హృత్కమలగంధర సానుభవంబు జెందు పె
న్నిద్దవుగండు డేటి, ధరణీ సుత కౌగిలి పంజరంబునన్
ముద్దులు గుల్కు రాచిలుక, ముక్తి నిధానను రామ, రాగదే
తద్దయు నేడు నాకడకు దాశరథీ కరుణాపయోనిధీ
కుక్షినజాండ పంక్తు లొనగూర్చి చరాచరజంతు కోటిసం
రక్షణచేయు తండ్రివి, పరంపర నీ తనయుండనైన నా
పక్షము నీవు గానలె? పాపము లెన్ని యొనర్చినన్ జగ
ద్రక్షక, కర్తనీవె కద, దాశరథీ కరుణాపయోనిధీ
పెంపను దల్లివై కలుష బృందసమాగమ మొందకుండ ర
క్షింపను దండ్రివై, మెయి వసించు దశేంద్రియరోగముల్ నినా
రింపనువెజ్జవై కృప గురించి పరంబు దిరంబుగా గ స
త్సంపదలియ్య నీవె గతి దాశరథీ కరుణాపయోనిధీ
విన్నపమాలకించు ర ఘువీర సహి ప్రతిలోక మందు నా
కన్న దురాత్ముడుం బరమ కారుణికోత్తమ వేల్పులందు నీ
కన్న మసాత్ముడుం బతిత కల్మష దూరుడు లేడు నాకు వీ
ద్వన్నుత నీవె నాకు గతి దాశర ధీ కరుణాపయోనిధీ