త్రిపిటిక కథలు

21/05/2012

అందువలన అక్కడ ఉండే సేవకులకు కొంత డబ్బు ఇచ్చి తృప్తిపరిస్తే, వారు అక్కడినుంచి నన్ను తొలగించరని అనుకొన్నాను. అంతేకాక స్వామివారు సంజ్ఞ చేసినా, అక్కడే నిలిచి ఉండాలని, నా అనుమానం తీరిపోయేవరకూ తిరిగి రాకూడదని నిశ్చయించుకొన్నాను.

20/05/2012

దానిని కనిపెట్టుకొని వున్న రామచంద్ర ముఖోపాధ్యాగారికి చటోపాధ్యాయగారు ఒక ఉత్తరం వ్రాసి ఇచ్చి, నాకు కాశీలో వసతి కల్పించారు. ఆ ఉత్తరంవల్ల నాకెంతో ఉపకారం జరిగింది. రామచంద్ర ముఖోపాధ్యాయ నాకు అన్నిసౌకర్యాలు కలిగించి ఆదరించాడు. మొదట నేను నా తల్లిదండ్రులకు శ్రాద్ధ కర్మలు చేశాను.

19/05/2012

స్వామివారి అద్భుత శక్తులుచూసి ఆకర్షితుడై, ఆనాటినుంచే ధర్మమార్గంలో నడవసాగాడు. హిందూ ధర్మప్రాశస్త్యం తెలిసికొని, స్వామివారి సేవకు ప్రతినెలా ధనం ఇవ్వటానికి నిశ్చయించుకొన్నాడు. ఆ విషయాన్ని మంగళదాస్ ఠాకూర్ ద్వారా స్వామీజీకి నివేదించుకొన్నాడు. అది విని స్వామివారు ఆగ్రహోదగ్రులై తన అసమ్మతిని తెలిపారు.

17/05/2012

ఆ తరువాత స్వామివారు చెప్పినట్లే ఆ పిల్లవాడు ఆరోగ్యవంతుడయ్యాడు.

16/05/2012

ఆయన హిందూ దేవతలను ఉపాసించటం వ్యర్థమని ప్రబోధింపసాగాడు. వారిని నిందింపసాగాడు. ప్రజలను తన ధర్మం వైపుకు తిప్పుకోవటానికి ప్రయత్నించసాగాడు. ఒక్క ఈశ్వరుడే జగత్కర్త అని, ఆయన నిరాకారి-చైతన్య స్వరూపుడు-సర్వవ్యాపి అయి జగత్కల్యాణ కారకుడవుతున్నాడని ప్రబోధించాడు.

15/05/2012

మహారాజు చాలా సంతోషించారు. అంతేకాక, తాను చెప్పకముందే స్వామిజీ తన మనస్సులోని అభిప్రాయాన్ని గుర్తించినందుకు మహారాజు ఆశ్చర్యపడ్డారు. మహారాజు చేతిలో ఒక ఖడ్గం ఉండింది. మహారాజుగారి శౌర్య సాహసాలకు సంతుష్టులైన బ్రిటీషువారు ప్రశంసాపూర్వకంగా ఆయనకిచ్చిన ఖడ్గమది.

14/05/2012

అది చూసి గాభరా పడిన పరివారం, కారణం ఏమిటో తెలియక గొడవపడసాగారు. కొద్దిసేపటికి రాజుగారికి తెలివి వచ్చింది. అట్లా పెద్దగా అరవటానికి కారణమేమిటని పరిజనం రాజును ప్రశ్నించారు. కాని మహారాజు ఆ రాత్రి వారికేమీ చెప్పలేదు.

13/05/2012

ఆ తరువాత స్వామీజీ యథేచ్చగా తిరుగవచ్చని అనుమతి ఇచ్చాడు. స్వామీజీకి అయిష్టమైన పని ఎవ్వరూ చేయరాదని ఆజ్ఞాపించాడు.

12/05/2012

స్వామివారి అసలు పేర్లయిన త్రైలింగధరుడు- గణపతిస్వామి వంటివి వారికి తెలియకపోవడంవలన, త్రిలింగ దేశానికి చెందినవాడని తెలుసుకొని, ఆయనను త్రైలింగస్వామి అని పిలువసాగారు.

10/05/2012

తన ఎదుట ఉన్న దైవస్వరూపులైన స్వామివారి పాదాలను పట్టుకొని నమస్కరించి, తనకు సంక్రమించిన భయంకర వ్యాధి నుంచి విముక్తిని ప్రసాదించమని ప్రార్థించాడు. కరుణామయులైన స్వామీజీ గంగానదిలోని మట్టిని తెచ్చి తినమని చెప్పి, తాము స్నానానికి వెళ్లిపోయారు.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading