‘‘ఫ్రెండ్సు అప్పుడప్పుడూ కలుస్తుంటారు. దానికొక రికార్డు ఉండదు’’
‘‘నిన్న రాత్రి ఏడు గంటలనుంచీ తొమ్మిది గంటలకు మధ్య ఎక్కడున్నావు?’’
డైలీ సీరియల్
‘‘ఫ్రెండ్సు అప్పుడప్పుడూ కలుస్తుంటారు. దానికొక రికార్డు ఉండదు’’
‘‘నిన్న రాత్రి ఏడు గంటలనుంచీ తొమ్మిది గంటలకు మధ్య ఎక్కడున్నావు?’’
పోలీసు స్టేషన్ నుంచీ. అసిస్టెంట్ కమిషనర్ రంగారెడ్డిగారిని వచ్చి కలవాలట. మళ్లీ పడుకునేద్దామనుకున్న నా ప్రణాళిక ఆపెయ్యక తప్పలేదు.
ఇంత ప్రొద్దునే ఈయనకు నాతో ఏం పని? రాత్రి కొడుకును పోగొట్టుకున్న ఈయన ఇంట్లో కుటుంబంతో శోకంలో పాలు పంచుకోకుండా ననె్నందుకు కలవాలని అనుకుంటున్నాడు?
సాయంత్రం చైతన్యను ఆఫీసుకు తాళం పెట్టేపని అప్పగించి కారు ఆశ్రమం వైపు పరిగెత్తించాను. ఆశ్రమానికి ఒకసారి వెళ్లాలని అనుకోవటానికి మరో కారణముంది. నా కళ్ళలో ఆసిడ్ వేస్తామని బెదిరించినవారు ఇంకా నా మీద నిఘా వేసుంచారా? ఆవేళ ఫోన్ చేసింది ఎవడో పిచ్చివాడయుండాలి.
కానీ సోమరాజు తాతయ్యకు ఎవర్నయినా కలవటానికి ఉత్సాహమే అని ఆయన్ను చూశాక తెలిసింది.
‘‘పది గంటలకే అన్నం తినేస్తాను కదా? ఆకలిగా ఉంది. రండి లోపలికి. కాఫీ మేకరూ, మైక్రోవేవూ అన్నీ గాడ్జెట్లు ఉన్నాయి. మీకు కాఫీ కావాలో, టీ కావాలో, మీకెలా కావాలో చేసుకోండి’’.
మొబైలు రింగ్ అయింది. తీసి చూస్తే, మధు ఫోను.
‘‘హలో రీటా!.. ఏం చేస్తున్నావు? బిజీనా?’’ ఇది ఆషామాషీ కాల్ అని అర్థమయింది.
‘‘ఇప్పుడే ఆఫీసు పని చాలించి రిలాక్స్ అవుదామని లోపలికొస్తున్నా’’.
‘‘ఏంటి ప్రోగ్రాం?’’
‘‘ఏమనుకోలేదు. ఏమయినా పనా?’’
‘‘ఆ ఏజెంట్ ఇచ్చిన స్టాక్ బ్రోకర్లు కొందరిని విచారించి చూడొచ్చు. ఎవరు నిజంగా అపెక్స్ షేర్లు కొంటున్నారో, అందులో ఏదయినా ప్రణాళిక ఉందా అని.’’
‘‘ఇపుడు చెప్పు ఏంటి విషయం?’’ అని అసలు విషయానికొచ్చేసింది కల్పన.
‘‘పంచవటి పూర్ణానంద స్వామి ఆశ్రమంలో కొన్ని లక్షల రూపాయలు విలువగల బాండ్లు ఫోర్జరీ అయిన విషయం తెలుసా?’’
నన్ను మళ్లీ అరగంట దాటినా ఏం పట్టించుకోలేదు. మూర్తి నా పేరు చెప్పగానే, తనే రమ్మని అన్నా, ఇలా ఆలస్యం చేస్తాడని నాకు తెలుసు. కలవడానికి వచ్చిన వారికన్నా, మనం గొప్ప అని చూపించే టెక్నిక్ అది.
సాయంత్రం అనుకున్నట్లు పెకింగ్ పాలస్ హోటల్ లాబీలో మధును కలుసుకున్నాను. ఆఫీసునుంచి నేరుగా ఇక్కడికొచ్చినట్లున్నాడు అదే బిజినెస్ సూట్‌లో ఉన్నాడు. కోటు తీసి మడిచి పట్టుకున్నాడు. స్టీవర్డ్ చూపించిన టేబుల్ దగ్గర్ సెటిల్ అయ్యాము. కోటు కుర్చీ బ్యాక్ రెస్టు మీద పడేసి కూర్చున్నాడు మధు.
‘‘ఈ పత్రాల మార్పిడి ఈమధ్యే జరిగినట్లుంది. తీసుకున్నవారింకా వాటితో బ్యాంకుకు వెళ్ళలేదు.. అసలు ఈ నకిలీ పత్రాల్లో ఉన్న నంబర్లక్రమంలో ఆ బ్యాంకు వాళ్ళు బాండ్లు విడుదల చెయ్యలేదట. అందుకే ఇవి నకిలీ అని సులభంగా కనుక్కోగలిగారు’’.