మీ వ్యూస్

18/05/2012

నేను గబ్బర్‌సింగ్ సినిమా చూశాను. హిందీ మూవీ దబాంగ్‌కి రీమేక్. కానీ డైరెక్టర్ హరీష్‌శంకర్ చాలా మార్పులు చేశాడు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్‌లో అన్నీ పాటలు బాగున్నాయి. పవన్‌కళ్యాణ్‌ని ఎలా చూడాలనుకున్నానో అలాగే సినిమాలో చూశాను.

11/05/2012

భద్ర, సింహా వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను మనకు అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘దమ్ము’ పరమచెత్తగా వుండి తెలుగు ప్రేక్షకులకు తీవ్రమైన శిరోభారం మిగిల్చింది. లాజిక్‌కు అందని కథ, అసహనం కలిగించే స్క్రీన్‌ప్లే సినిమా ఫెయిల్ అవడానికి ముఖ్య కారణాలు.

11/05/2012

రానురాను తెలుగు సినిమా జనాలకు ఫ్యూడలిజం తలకెక్కుతోంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లి, దశాబ్ధాలు గడుస్తుంటే, తెలుగు సినిమా హీరోలకు మాత్రం నరనరానా ఫ్యూడలిజం భావాలు నిండిపోతున్నట్లు అనిపిస్తోంది.

04/05/2012

ఆరెంజ్ సినిమా ఫ్లాప్‌తో తీవ్ర నిరాశకు గురైన రామ్‌చరణ్ అభిమానులకు ఆనందాన్ని తిరిగి యిచ్చిన టూ అవర్స్ నాన్స్‌స్టాప్ ఎంటర్‌టైనర్ ‘రచ్చ’. రామ్‌చరణ్ చేసిన డాన్స్‌లు, ఫైట్స్, కామెడీ సీన్స్, ముఖేష్‌రుషి అనుచరగణంతో యాక్షన్ సన్నివేశాలు, పంచ్ డైలాగ్స్ అన్నీ అదరహో! తమన్నాతో రొమాన్స్ కూడా బాగా వచ్చింది.

27/04/2012

తేజకు డాష్.. డాష్...

19/04/2012

ఎన్నో అంచనాలతో మొదటి రోజే రచ్చ సినిమాకి పోతే పూర్తి నిరుత్సాహంతో ఇంటికి తిరిగి రావాల్సివచ్చింది. ఎందుకంటే సినిమా అంతా పాత చింతకాయ పచ్చడిలా వుంది. ఎక్కడా కొత్తదనం లేదు. అసలు రామ్‌చరణ్‌కి ఈ సినిమా కథలో ఏం నచ్చి ఒప్పుకున్నాడో ఏంటో... పార్తీబన్, అజ్మల్‌ల క్యారెక్టర్లకు సరైన ప్రాముఖ్యం లేదు.

13/04/2012

కాలేజ్ వాతావరణం, బాయ్‌ఫ్రెండ్ అమ్మాయిల పాలిట ‘ఏటీఎం కార్డ్’అన్న మాటలు అక్షర లక్షల సత్యం. కొన్ని సందర్భాల్లో అబ్బాయిలు అమ్మాయిలను వాడుకుంటే ఎక్కువగా సందర్భాల్లో అమ్మాయిలు అబ్బాయిలను యూజ్ అండ్ త్రో పాలసీతో ప్రవర్తిస్తుంటారు.

06/04/2012

అబ్బా, ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు ఓ మంచి ‘లవ్‌లీ’ పిక్చర్ చూసి తృప్తిపడ్డాం. ముఖ్యంగా యువతరాన్ని లక్ష్యంగా చేసుకుని రూపొందించిన చిత్రమిది. ప్రతి సన్నివేశంలో దమ్ముంది. కెమెరాతనం బాగుంది.. అనూప్‌రూబెన్స్ పాటలు విన్నకొద్దీ మెలోడీయస్‌గా వున్నాయి. ఆది చురుగ్గా నటించడమేగాక మంచి డాన్సర్ అనిపించుకున్నాడు.

29/03/2012

సూపర్ వెరైటీగా టూ అవర్స్ మిమ్మల్ని తెగ నవ్వించేస్తామంటూ తెగ పబ్లిసిటీ చేసి, కామెడీ చిత్రం పేరిట హీరోహీరోయిన్ల చేత చిత్రవిచిత్రమైన విన్యాసాలను చేయించి, చక్కిలిగింతలు పెట్టినా నవ్వు రాని కామెడీ సీన్లతో, మధ్యమధ్యలో అక్కర్లేని ఫైటింగులతో నువ్వా? నేనా?

23/03/2012

తెలుగు సినిమా పట్ల విరక్తి కలగాలంటే ‘మిస్టర్ నూకయ్య’ తప్పనిసరిగా చూడాలి. గొప్ప వెరైటీ చిత్రమని ఒక పక్క మీడియాలో ఊదరగొట్టి టైటిల్ వివాదంతో బోలెడు ఫ్రీ పబ్లిసిటీ సాధించుకున్న దర్శక నిర్మాతలు అర్ధంకాని కథ, గందరగోళంతోవున్న కథనంలతో ఒక చెత్త సినిమాను మన పైకి వదిలారు.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading