ఇచ్చిన ఆధారాలను బట్టి పదాన్ని కనుక్కుని అడ్డం, నిలువుగళ్లను పదాలతో పూరించే క్రీడ క్రాస్‌వర్డ్ పజిల్‌గా మొట్టమొదట 1913వ సంవత్సరంలో న్యూయార్క్ నుండి వెలువడే ‘వరల్డ్’ పత్రిక ఆర్థర్ వెస్ అనే రచయిత రూపొందించగా ప్రచురించింది. ఆదివారం అనుబంధంలో దానికి అనూహ్యమైన ఆదరణ లభించింది.







