అక్షర
నా కవిత్వమంతటా మనిషి చేవ్రాలు, మేని స్పర్శలు, జన సమూహాలు, పాదముద్రలే అని ప్రకటించుకున్న కవి విజయచంద్ర మరో కవితా సంపుటి ‘జై గంగే’. కవి గంగానదిని జయజయ నాదాలతో ప్రస్తుతించడానికి కారణం ఆ నది అమరవీరుల స్మృతి సందేశాలను, అశ్రు నివాళులను గౌరవ సూచకంగా తన అలలపై మోసుకెళ్లడమే.
మహాభారతం- మానవ ధర్మం డా.డి.విద్యేశ్వరి, డా.ఐ.వి.కాంతలక్ష్మి, పేజీలు: 252; ధర: రు.150/- ప్రతులకు: విశాలాంధ్ర బుక్‌హౌస్ అన్ని బ్రాంచీలలో లేక రచయిత్రులు డా.డి.విద్యేశ్వరి, సెల్: 8106586878; డా.ఐ.వి.కాంతలక్ష్మి ; సెల్: 9490993532.
‘రాము-సోము’ న్యాయపతి రాఘవరావు వెల: రూ.50/- అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాల్లో లభ్యం.
‘సోమయ్యకు నచ్చిన వ్యాసాలు’ వాడ్రేవు చిన వీరభద్రుడు వెల: రూ. 250/- పే: 476 సోల్ డిస్ట్రిబ్యూటర్స్: నవోదయ, హైదరాబాద్
పద్యకవులకు కమ్మని పద్యం దొరికితే ఆకలి తీరుతుంది. పద్యం మంచి తేనెపట్టు. తియ్యదనాన్ని ఆస్వాదించడానికి. పద్యం మంచి పారిజాతం, సుగంధాన్ని ఆఘ్రాణించడానికి. పద్యం చంద్ర జ్యోత్స్న, చల్లని స్పర్శను అనుభవించడానికి. పద్యం కన్నతల్లి, ప్రేమామృతం గ్రోలడానికి.