కళ

23/02/2012

కర్ణాటక శాస్ర్తియ సంగీత, మన రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుమల మరియు శ్రీ గురురాఘవేంద్ర స్వామి క్షేత్రమైన మంత్రాలయంలో నిత్యం శాస్ర్తియ సంగీతంతో నాదార్చన జరుగుతుంది.

23/02/2012

సద్గురు శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవాలను అత్యంత శ్రద్ధాసక్తులతో శారదా కల్చరల్ ట్రస్టు నిర్వహిస్తున్నారు. 165వ త్యాగరాజ ఆరాధనోత్సవాలు స్థానిక కీస్ గరల్ల్స్ హైస్కూలులో వైభవంగా నిర్వహించారు. ప్రముఖ సంగీత విద్వాంసురాలు అవసరాల కన్యాకుమారి వయొలిన్ విన్యాసంతో శుభారంభమైనాయి.

23/02/2012

మధ్యతరగతి నవాబు - అనే శీర్షికతో గుర్రం మల్లేశం ఒకానొక చిత్రలేఖనాన్ని రూపొందించి కళాభిమానుల్లో అంతులేని ఆలోచనల్ని రేకెత్తించాడు. ఆధునికోత్తర చిత్రకళా వికాసానికి ఆ బొమ్మ ప్రతీకగా నిలిచింది. మల్లేశం తనే ఒక మధ్యతరగతి నవాబుగా ఇందులో కనిపిస్తాడు.

23/02/2012

ఏ వ్యక్తికైనా కళల పట్ల అభిరుచి ఉండడంతో ఆ కళలో నైపుణ్యం సంపాదించడానికి దోహదం చేస్తుంది. ఆ కళ సంగీతమో, నాట్యమో, నాటకమో, చిత్రలేఖనమో ఏదన్నా కావచ్చు. వారి అభిరుచిని అనుసరించి ప్రవేశాన్ని, నైపుణ్యాన్ని పొందడం జరుగుతుంది.

23/02/2012

రంగస్థల నటుడు నిరంతరాభ్యాసంలో మునిగి, అప్పటికప్పుడు ప్రయోగాత్మక ప్రతిభను కనబరిచే సత్తాను కలిగివుండాలి. వినయశీలి, ప్రకృతిని ఆరాధించే తత్వం, సమాజాన్ని ప్రేమించే నైజం... ఇవన్నీ ఆ నటునికి అదనపు బలాలు.

23/02/2012

నాటరాగంలో నినే్న భజింతునని పరంధాముని కొలిచి, సావేరి రాగంలో శంకరీ శుభంకరీ అంటూ జగన్మాతను కీర్తించి, శంకరాభరణ రాగంలో అలరులు కురియగా అనే అన్నమయ్య కృతిని తన కోమల, మంజుల, మధుర స్వరంతో ఆలపించి రెండున్నర గంటల కర్ణాటక సంగీత కచేరీని సుస్వర రాగరంజితం చేశారు చెన్నై నగరానికి చెందిన సుప్రసిద్ధ విదుషీమణి మీనాక

16/02/2012

అతని కళలో అపారమైన వైవిధ్యం కనిపిస్తుంది. ఒకచోట ఒకో విధంగా స్పందించడం, ఆ స్పందన వెనుక ఏదో గాఢమైన ఆలోచన ధ్వనించడం కనిపిస్తుంది. ఆధునిక యుగంలో కాదేదీ కళకనర్హం అన్నట్లుగా అన్ని రకాలైన అంశాలకు శిల్పరూపం కల్పించేందుకు కళాకారులు ప్రయత్నిస్నున్నట్లు మనకు అర్థమవుతుంది.

16/02/2012

ఆనాటి మహానటుడు ఎస్.వి.రంగారావుగారి నుంచి నేటి కోటా శ్రీనివాసరావు, ఎల్.బి.శ్రీరాం, తనికెళ్ళ భరణి లాంటి గొప్ప నటులు అందరూ కూడా కళామతల్లి ఒడి అయిన రంగస్థలం అందించిన ముద్దుబిడ్డలే.. రంగస్థలంపైన నటించడం సినిమాల్లోనటించడం కాదు.. ఎవరి డయలాగ్ వారే చెప్పాలి.. డబ్బింగుండదు..

16/02/2012

ఏ కళ అయనా మనసుకు హాయని సమాజానికి, హితాన్ని కలిగిస్తుంది. మానవునికి ఉత్తమ సంస్కారానికి బాటలు పరుస్తుంది. కళ మనసును మలినపరిచిన మాలిన్యాలను తుడిచి వేస్తుంది. దీనివల్ల మనిషి దివ్యత్వాన్ని పొందుతాడు. ఆ దివ్య జీవనంతో అందరికీ ఆదర్శ ప్రాయునిగా నిలబడుతాడు.

16/02/2012

శ్రీరామగానసభ శ్రీరామాలయ ప్రాంగణంగా కొత్త నల్లకుంటలో గత 43 సంవత్సరాలుగా ఎంతో వైభవంగా జరుపుతూ వస్తున్నాయి. ఒక సంగీత సభ నడిపించడం చాలా కష్టం. ఎంతో మంది ఔత్సాహికులు మరియు ప్రముఖ విద్వాంసులు గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఉత్సవాలలో పాలు పంచుకొంటున్నారు.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading