నుడి

19/05/2012

.......................................

19/05/2012

రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో విద్యార్థులు తెలుగు భాష మాట్లాడితే, తెలుగు పదాలు వాడితే అదేదో చేయరాని నేరం చేసినట్లుగా భావించి వారిపై చర్యలు తీసుకోవడం, విద్యార్థులందరి మధ్యన నిలబెట్టి వారిని మందలించడం లాంటివి జరుగుతునే ఉన్నాయి. పాఠశాలలో చేరడం విద్యను నేర్చుకోవడానికా?

19/05/2012

అడక: తెలుగు భాష ప్రాచీనతకు గాథా సప్తశతిని సాక్ష్యంగా పేర్కొనడం బాగానే ఉంది. అంతకుముందే తమిళం ఉన్నదని చెప్పడం ఎంతవరకు సబబు? -ఆర్.రామేశ్వరం, హైదరాబాద్

19/05/2012

ఇంటర్‌మీడియెట్ స్థాయిలో తెలుగుకు (కార్పొరేట్) సంస్కృతం ఉరి వేస్తున్నది అని అంటున్న సుబ్బాచారి, అలా ఎందుకవుతుందో గమనించలేదు. కార్పొరేట్ సంస్థలలో తెలుగుకు నిరాదరణ జరుగుతోందనే విషయాన్ని శ్రీ సుబ్బాచారి చెప్పినదంతా వాస్తవమే. ఐతే అలా ఎందుకు జరుగుతోంది? అని కొంచెం పరిశీలిస్తే అసలు సంగతి అవగతవౌతుంది.

19/05/2012

సొగసు చూడతరమా అని కవిగారు ఊరకే అనలేదు. సొగసు పాదాల్లో వుంటుందని చైనావారు ఎక్కువగా భావిస్తారట. మనమూ పాదాల్లో సొగసులు చూస్తాం అయితే అది పద్యపాదాల్లో. వాక్య సముదాయంలోని వాక్యపాదాల్లో. పాదాల్లో ప్రయోగించే పదాలే భాషలో సొగసు మరి!

19/05/2012

పెరనుడుల నుంచి మాటలను తెచ్చుకొని వాడడం అన్ని నుడులలోనూ ఉన్నదే. అయితే, ఆ ఎరువు మాటలను మన పలుకు తీరుకు అనువుగా మార్చుకొని వాడడం సరైన తీరు. రోడ్, బస్‌లాటి మాటలను రోడ్డు, బస్సు, అనే కదా వాడుతున్నాం? మచ్చుకు - హోసూరు తావున వాన కార్తెలను తెలుగు పలుకుతీరుకు అనువుగా మార్చుకొని పలుకుతుంటారు.

19/05/2012

నుడి
నిర్వహణ: డా.సామల రమేష్‌బాబు
- ncharithra@gmail.com Cell: 9848016136

రచనలు పంపవలసిన చిరునామా:

ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్ - 500003

12/05/2012

దేశానికి ‘స్వాతంత్య్రం’ అంటే ‘పరాయి దేశస్థుడు మన దేశాన్ని వదలి వారి దేశానికి వెళ్లిపోవడం’ అనే భ్రమలో మనం జీవిస్తున్నాం. కాని ఆ పరాయి దేశస్థుని భాషా గోపురాలక్రిందే, వారి వ్యాపార పునాదులపైనే మనం జీవిస్తున్నామన్న విషయం మాత్రం మరచిపోతున్నాం.

12/05/2012

అడక: డిసెంబర్‌లో ప్రపంచ తెలుగు మహాసభల్ని తిరుపతిలో జరుపబోతున్నట్లు మనరాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. తెలుగుకోసం ఏమీ చెయ్యని ఈ ప్రభుత్వం ఏం ముఖం పెట్టుకొని ఈ ప్రకటన చేసింది?
- రా. వెంకటకృష్ణ, గుంటూరు

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading