సంజీవని

29/10/2014

బ్రెయిన్ స్ట్రోక్ ఏ వయసులోనైనా రావచ్చు. జీవితకాలంలో ప్రతి ఆరుగురులో ఒకరు బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతున్నారు. మరణ కారణాలలో ఈ అనారోగ్యం రెండవ స్థానాన్ని అలంకరించింది. మన దేశంలో లక్షలమందిలో వందనుంచి రెండు వందల మంది స్ట్రోక్ బాధితులవుతున్నారు.

29/10/2014

వివాహ పూర్వ కౌమార గర్భం ఒక కీలకమైన ఆరోగ్య సమస్యే కాక ఒక సామాజిక సమస్య కూడా. ఇది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన సమస్య మాత్రమే కాక అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్య కూడా.

29/10/2014

హైటెక్ యుగంలో రోజురోజుకు ఊహకు కూడా అంతుపట్టని విధంగా ఒకవైపు టెక్నాలజీ పెరుగుతుంటే, మరోవైపు పురాతన మూఢాచారాలు రోజురోజుకు బలపడుతుండడం విడ్డూరంగా ఉంది.

29/10/2014

మన శరీరంలోని ప్రతీ అవయవానికి రక్తం సరఫరా చేయడానికి కొన్ని ప్రత్యేక రక్తనాళాలుంటాయి. వాటి ద్వారా ఆయా అవయవాలకి రక్తప్రసరణ జరుగుతుంది. రక్తం ద్వారానే ఆహారం ఆక్సిజన్ సరఫరా అన్ని కణాలకు జరుగుతుంది. రక్తం చేరని ప్రాంతానికి ఇవి చేరక ఇబ్బంది పడతాం.

29/10/2014

ప్రస్తుత కాలంలో మారిన జీవనశైలి విధానంవల్ల, సరైన పోషక ఆహారం తీసుకోక చాలామంది మణికట్టు (రిస్ట్ జాయింట్) నొప్పితో బాధ పడుతున్నారు. నిత్య జీవితంలో ఏ పని చేయాలన్నా, వస్తువులను పైకి ఎత్తాలన్నా, గట్టిగా పట్టుకోవాలన్నా, మణికట్టు కీలు మరియు కండరాల కదలికతోనే చేయవల్సి ఉంటుంది.

22/10/2014

గుండెపోటు ఎవరికైనా, ఏ సమయంలోనైనా, ఎక్కడ ఎలా వున్నా రావచ్చు. గుండెకు రక్తసరఫరా చేసే నాళాలు మూడు. వాటిని కరోనరి ఆర్టెరీస్ అంటారు. వీటిల్లో అడ్డంకులు వస్తే గుండె కండరాలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. దాంతో ఆహారం, ఆక్సిజన్ సరిగ్గా అందదు. కార్డియక్ అరెస్ట్ సంభవించి గుండె కండరాలు నీరసిస్తాయ.

22/10/2014

ఇటీవల నిర్వహించిన సర్వేల వల్ల తేలిందేమిటంటే మన దేశంలో 36 మిలియన్లకుపైగా ప్రజలు ఆస్టియోపోరోసిస్‌తో బాధపడుతున్నారు. కాగా, ఇది ఆడవాళ్ళలోనే్ల ఎక్కువగా కనిపిస్తుంది. అలాగని మగవాళ్ళల్లో కనిపించదని కాదు.

22/10/2014

సర్వశరీరగతంగా వ్యాపించిన కండరాల నొప్పిని ఫైబ్రోమైయాల్జియా అంటారు. నొప్పి కండరాల్లోనూ, మెత్తని కణజాల సముదాయాల్లోనూ నిగూఢంగా ఉంటుంది. కటి ప్రదేశానికి ఎగువన, దిగువన, శరీరానికి ఇరుపక్కలా కేంద్రీకృతమై ఉంటుంది. నిజానికి ఇది ఒక వ్యాధి కాదు కొన్ని లక్షణాల సమూహం. అందుకే దీనిని సిండ్రోమ్ అంటారు.

22/10/2014

పళ్లు అందానికి చిహ్నం. ‘అందం’ అంటే ఏమిటి? అందం ఎంతవరకు అవసరం, మనిషి భవిష్యత్‌లో అందం ప్రాముఖ్యత ఏమిటి? అందం ఎన్ని రకాలు? ఏ వయస్సులో, ఏ విధమైన శ్రద్ధాసక్తులు, మెలకువలు అవసరం అనే విషయాలను తెలుసుకుంటే జీవితాంతం అందంగా ఉంటూ ఆనందంగా, ఆరోగ్యంగా జీవించవచ్చు.

22/10/2014

మన దేశంలో పొగ తాగడం, పొగాకు పదార్థాల్ని తీసుకోవడం చాలా ఎక్కువ. అందుకని నోటి కాన్సర్స్ ఎక్కువ. ఏది తినాలన్నా నోటికి ఎలాంటి సమస్య ఉండకూడదు. అలాగే ముఖంలో నోరు ప్రధానంగా కనిపిస్తుంటుంది. అందుకని నోటి కాన్సర్ అన్ని క్యాన్సర్లకన్నా ఇబ్బందికరమైంది. చూడడానికి ఇబ్బందిగానే ఉంటుంది.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading