బీజింగ్, ఫిబ్రవరి 4: చైనాలోని ఓ బొగ్గుగనిలో జరిగిన పేలుళ్ళలో 13 మంది దుర్మరణం చెందారు. ఎనిమిది మంది గాయపడ్డారు. చైనాలోని సిచౌన రాష్ట్రంలోని గనిలో పేలుళ్ళు సంభవించినట్టు అధికారులు తెలిపారు. యిబిన్ నగరంలోని డియోటియా గనిలో జరిగిన ప్రమాదంలో 13 మంది మృతి చెందినట్టు వారు ధృవీకరించారు.



