రాష్ట్ర వార్తలు

18/12/2014

హైదరాబాద్: ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు గాలి జనార్ధన్ రెడ్డికి బెయిల్ స్కాంలో హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. కీలకమైన ఓఎంసీ మైనింగ్ కేసు విచారణ కొనసాగుతోంది.

18/12/2014

హైదరాబాద్:ఎంసెట్ పరీక్షను ఉమ్మడిగా నిర్వహించాలని, ఈ విషయం విభజన చట్టంలో ఉందని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. మంత్రి గురువారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన తేదీలలో తాము ఇంటర్ పరీక్షలు నిర్వహించటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

18/12/2014

హైదరాబాద్:పీజేఆర్ తనయుడు జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ బెయిల్ పిటిషన్ విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. ఓ పెళ్లి వేడుకలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డికి, విష్ణు మధ్య గొడవ జరిగిన విషయం విధితమే.

18/12/2014

హైదరాబాద్:సైన్‌ఫ్లూ వల్ల గాంధీ ఆసుపత్రిలో ముగ్గురు మృతిచెందిన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి రాజయ్య గురువారంనాడు గాంధీ ఆసుపత్రి వైద్యులతో సమీక్ష నిర్వహించారు. సైన్‌ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాజయ్య పేర్కొన్నారు.

18/12/2014

హైదరాబాద్‌ : ఏపీ అసెంబ్లీ వాయిదా అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత టీడీఎల్పీ భేటీ అయ్యింది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చిస్తున్నారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొన్నారు.

18/12/2014

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా ఘంటా చక్రపాణి ప్రమాణ స్వీకారం చేశారు. ఘంటా చేత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి తదితరులు హాజరైయ్యారు.

18/12/2014

హైదరాబాద్: గురువారం ఉదయం ప్రారంభమైన ఎ.పి. శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ, పాకిస్తాన్‌లో పాఠశాల విద్యార్థుల మృతిపట్ల శాసనసభ తీవ్ర సంతాపం ప్రకటించింది.

18/12/2014

హైదరాబాద్: రెండు రోజులుగా హైదరాబాద్ నగరంలో చలి తీవ్రత అధికమైంది. పగటి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల నుంచి 12 డిగ్రీలకు పడిపోయాయి. బలమైన శీతగాలులు వీస్తూండటంతో నగరంతోపాటు శివారు ప్రాంతాల ప్రజలు చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

18/12/2014

హైదరాబాద్: విద్యా ప్రమాణాలు, ఐటి రంగం, ఉపాధి అవకాశాలు, స్కాలర్‌షిప్‌లు తదితర విషయాలపై చర్చించేందుకు ఎ.పి. ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం హైదరాబాద్‌లో తొలిసారిగా విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో సమావేశమవుతున్నారు.

18/12/2014

హైదరాబాద్: శాసనసభ సమావేశానికి వెళుతూ ఎ.పి. ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఉదయం సచివాలయం సమీపంలోని ఎన్టీఆర్‌ఘాట్‌కు వెళ్లి నివాళులర్పించారు. ఐదు రోజులపాటు జరిగే శాసనసభ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్‌ఘాట్ వద్ద పూలలు ఉంచి బాబు నివాళులర్పించారు.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading