S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అండమాన్ దీవుల్లో హత్యకు గురైన అమెరికా యాత్రికుడు

అండమాన్: అమెరికా యాత్రికుడు అండమాన్ దీవుల్లో హత్యకు గురయ్యాడు. జాన్ అల్లెన్ చాహును స్థానిక తెగకు చెందినవారు బాణాలు, విల్లంబులతో చంపేశారని జాలర్లు తెలిపారు. టూరిస్ట్ జాన్ మృతదేహం కోసం అండమాన్ పోలీసులు హెలికాప్టర్‌తో గాలిస్తున్నారు.

రాజీనామా చేసే ఆలోచన లేదు:జుకన్‌బర్గ్

శాన్‌ఫ్రాన్సిస్‌కో: తనకు రాజీనామా చేసే ఆలోచన లేదని ప్రముఖ సోషల్ మీడియా సైట్ ఫేస్‌బుక్ సీఇఓ జుకన్‌బర్గ్ వెల్లడించారు. పెట్టుబడుదారుల నుంచి ఒత్తిడి వస్తున్నప్పటికీ తాను పదవి నుంచి తప్పుకోవటానికి ఇష్టపడటం లేదని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో వెల్లడించారు. ఎక్కడ ఏమి జరిగినా నాదే బాధ్యత అని అన్నారు.

పాక్‌కు భద్రతా సహకారం నిలిపివేత

వాషింగ్టన్: పాక్‌కు భద్రతా సహకారాన్ని నిలిపివేస్తూ ఆగ్రరాజ్యం అమెరికా చర్య తీసుకుంది. ఈమేరకు 1.3 బిలియన్ డాలర్ల సహకారాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ట్రంప్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా విదేశాంగ ప్రతినిధి వెల్లడించారు. ఉగ్రవాద కార్యకలాపాల నిరోధించే విషయంలో పాకిస్థాన్ తన వైఖరిని మార్చుకోకపోవటంతో అమెరికా ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది.

బీజేపీ యువమోర్చా నేత ఆత్మహత్య

కోర్బా:చత్తీస్‌గఢ్‌లోని బాల్కోనగర్‌లో బీజేపీ యువ మోర్చాకు చెందిన మండల అధ్యక్షుడు కుమార్ చంద్ర (37) తన ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. బాల్కోనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని భరదపారాలో ఉంటున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.

సభ్యత్వం నమోదు వేగం పెంచాలి:చంద్రబాబు

అమరావతి: పార్టీ సభ్వత్వం నమోదు వేగం పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన బుధవారంనాడు పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. బూత్ కన్వీనర్ల శిక్షణ వేగం పెంచాలని సూచించారు. మిగిలిన మూడు ధర్మపోరాట సభలను విజయవంతం చేయాలని కోరారు.

తెలంగాణలో మహాకూటమికి మెజార్టీ

హైదరాబాద్: తెలంగాణలో మహాకూటమికి భారీ మెజార్టీ వస్తుందని, తాను మాత్రం సీఎం రేసులో లేనని మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ మొత్తం బాధ్యతను తానే తీసుకుంటానని వెల్లడించారు. టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ నివాసానికి జైపాల్‌రెడ్డి వచ్చారు. భిక్షపతి యాదవ్‌ను వదులుకోవద్దని అధిష్టానానికి చెబుతానని వెల్లడించారు.

మరో ఆప్ నేతపై దాడి

ఢిల్లీ: మరో ఆప్ నేతపై దాడి జరిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై దాడి సంఘటన మరువకముందే ఆమ్ ఆద్మీకి చెందిన పార్టీ సీనియర్ నేత సురేశ్ శర్మపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. మంగళవారం సాయంత్రం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు సురేశ్ ఫర్నిచర్ దుకాణానికి వచ్చారు. అనంతరం వారు దగ్గర నుంచి సురేశ్ శర్మపై కాల్పులు జరిపి పరారయ్యారు. సురేశ్ పరిస్థితి నిలకడగా ఉంది. ఈ దాడిని ఆప్ నేతలు తీవ్రంగా ఖండించారు.

సిట్ ఎదుట హాజరైన అక్షయ్‌కుమార్

చండీఘర్: 2015లో జరిగిన మతపరమైన అల్లర్లకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట సినీ నటుడు అక్షయ్‌కుమార్ హాజరయ్యారు. ఈ కేసులో అక్షయ్‌కుమార్‌కు, పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్, డిప్యూటీ సీఎం సుఖబీర్ సింగ్‌కు సమన్లు జారీ చేసిన విషయం విదితమే.

కూలీలపై నుంచి వెళ్లిన కారు:ఐదుగురి మృతి

హిసార్: బ్రిడ్జిపై నిద్రిస్తున్న కూలీలపై నుంచి కారు దూసుకువెళ్లటంతో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో తొమ్మిది మంది వ్యక్తులు గాయపడ్డారు. హర్యానాలోని హిసార్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనలో కూలీలంతా బ్రిడ్జి పనులు చేసి అక్కడే నిద్రిస్తున్నారు. వేగంగా వెళుతున్న కారు డివైడర్‌ను ఢీకొని బ్రిడ్జిపై నిద్రిస్తున్న కూలీలపైకి వెళ్లింది.

రాహుల్ నివాసానికి కొండా

న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పిన ఎంపీ కొండా విశే్వశ్వరెడ్డి బుధవారంనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి కుంతియాతో కలిసి ఆయన రాహుల్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులతో పాటు తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులను వివరించారు. టీఆర్‌ఎస్‌కు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన సోనియా సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

Pages