S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నౌకా నిర్మాణ రంగంపై దక్షిణ కొరియా ఆసక్తి

విజయవాడ: నౌకా నిర్మాణ రంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియా సంస్థలు ఆసక్తి కనబరిచాయి. నీటిని శుద్ధి చేసే ప్రక్రియలో సాంకేతికతను అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఉండవల్లిలోని గ్రీవెన్సు హాల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని దక్షిణ కొరియాలో భారత కాన్సులేట్ జనరల్ నేతృత్వంలో ఆ దేశ పారిశ్రామికవేత్తల బృందం సోమవారం కలిసింది. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించింది. ఏపీలో ఆహార, వస్తు తయారీ పరిశ్రమలు, నౌకా నిర్మాణం, పారిశ్రామిక నిర్మాణ రంగంపై ప్రధానంగా కొరియా పారిశ్రామికవేత్తలు దృష్టి పెట్టారు.

పాడేరు ఘాట్‌లో ఘోర ప్రమాదం

పాడేరు: విశాఖ జిల్లా పాడేరు ఘాట్‌లో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. మృతుల్లో ఆరు నెలల చిన్నారి ఉండగా మరో బాలుడు ప్రాణాలతో మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. పాడేరు మాజీ ఎంపీపీ ఎస్‌వీవీ రమణమూర్తి కుటుంబ సభ్యులు పెందుర్తిలో నివాసం ఉంటూ విజయదశమి సందర్భంగా ఇటీవల పాడేరు వచ్చారు. సోమవారం మధ్యాహ్నం పాడేరు నుంచి వీరు తిరిగి వెళ్తున్న ఆటో ఘాట్‌లోని వంట్లమామిడి-కోమాలమ్మ మలుపు మధ్య ప్రమాదానికి గురైంది.

విశాఖ చేరుకున్న భారత్-వెస్టిండీస్ జట్లు

విశాఖపట్నం: అయిదు వనే్డల సిరీస్‌లో భాగంగా 24న జరిగే రెండో వనే్డలో తలపడేందుకు భారత్, వెస్టీండీస్ క్రికెటర్లు సోమవారం విశాఖ చేరుకున్నారు. గౌహాతీలో జరిగిన తొలి వనే్డలో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వెస్టిండీస్ కెప్టెన్ హోల్డర్ నేతృత్వంలో ఇరు జట్లు సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నాయి. ఇరు జట్లకు మ్యాచ్ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. స్థానిక ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత్ జట్టు ఈ స్టేడియంలో వరస విజయాలను కైవసం చేసుకుంది.

విపత్తులపై ముందే హెచ్చరించా..!

అమరావతి, అక్టోబర్ 22: విభజన సమయంలోనే ఏపీలో విపత్తుల గురించి హెచ్చరించామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుర్తుచేశారు. నీరు-ప్రగతి పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అనిల్‌చంద్ర పునేఠా సోమవారం జిల్లా కలెక్టర్లు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాన్లు, వర్షాభావం, కరవు పరిస్థితులు ఉత్పన్నమవుతాయని విభజన సందర్భంగా గుర్తుచేసినట్లు చెప్పారు. నాలుగేళ్లలో హుదూద్, తిత్లీ తుపాన్లు సంభవించాయి.. మరో రెండేళ్లు కరవు పరిస్థితులు ఎదుర్కొన్నాం.. భౌగోళిక ప్రత్యేకత దృష్ట్యా ఏపీని ప్రత్యేక రాష్ట్రంగా చూడాలని కోరా..

ఇది ముమ్మాటికీ ముఖ్యమంత్రి వైఫల్యమే!

విశాఖపట్నం, అక్టోబర్ 22: తిత్లీ తుపాను బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి పూర్తిగా విఫలమయ్యారని జనసేన అథినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుపానులో నష్టపోయిన వారు ఇంకా కోలుకోకముందే, తుపాను ప్రాంతాల్లో పరిస్థితి అంతా మెరుగుపడిందని ముఖ్యమంత్రి ప్రచార విన్యాసాలు చేయడం వలన, సాయం అందించడానికి కేంద్రం ముందుకు రావడం లేదన్నారు. తిత్లీ తుపాను దారుణంగా ఉండబోతోందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నా, అందుకు తగ్గట్టుగా ముఖ్యమంత్రి తన అధికార యంత్రాంగాన్ని ముందుకు నడిపించలేకపోయారని పవన్ కళ్యాణ్ విమర్శించారు.

సీట్ల సర్దుబాటు సమస్య కాకూడదు..

అవసరమైతే రాహుల్‌తో మాట్లాడతా: టీ.నేతలతో బాబు
ఎంత కష్టమొచ్చెనండి రాజ్యమేలు తెదేపాకు!
సర్దుబాటు పద్దుకింత కూటమిలో కరివెపాకు!!
తెలంగాణ ఇచ్చినట్టి కాంగ్రెస్‌తో బేరము!
ఉమ్మడి పోరాటనేత బాబు దేమి చోద్యము!!

ఉగ్రవాద కార్యకలాపాలను ఆపండి

జమ్మూ: పాకిస్తాన్ ఇకనైనా కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను నిలిపివేయాలని భారత్ గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఆదివారం పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి చొరబడటానికి ఉగ్రవాదులు ప్రయత్నించిన నేపథ్యంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు పాక్ ఉగ్రవాదులతో పాటు ముగ్గురు భారత్ జవాన్లు సైతం మృతి చెందిన విషయం తెలిసిందే.

‘కూటమి’ని కూకటివేళ్లతో పెకలిద్దాం

గజ్వేల్, అక్టోబర్ 22: ప్రజా వ్యతిరేక పాలన, ప్రజా వంచకపాలన చేసిన కాంగ్రెస్, టీడీపీల కుట్రలతో మహా కూటమి ఏర్పడగా, ఆ కూటమిని కూకటి వేళ్లతో పెకలిద్దామని మాజీ ఎమ్మెల్యే, మంత్రి తన్నీరు హరీష్‌రావు స్పష్టం చేశారు. సోమవారం గజ్వేల్‌లో టీఆర్‌ఎస్ ప్రచార శంఖారావం పూరించిన సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు. అధికారం కోసం కాంగ్రెస్ తాపత్రయ పడుతుండగా, తెలంగాణపై పెత్తనం కోసం ఏపీ సీఎం చంద్రబాబు ఆరాటపడుతున్నట్లు ఎద్దేవా చేశారు.

పుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్‌లను పొందండి

హైదరాబాద్, అక్టోబర్ 22: యుఎస్ ఇండియన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న ఫుల్ బ్రైట్ స్కాలర్‌షిప్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అడం గ్రోస్కే పేర్కొన్నారు. భారతీయులు ఫుల్ బ్రైట్ స్కాలర్‌షిప్‌నకు పోటీ పడాలని ఆమె సూచించారు. సోమవారం నాడు ఆమె ఇఫ్లూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఇ సురేష్‌కుమార్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఫుల్ బ్రైట్ స్కాలర్‌షిప్ గురించి చర్చించారు. వర్శిటీ, యుఎస్‌ఐఇఎఫ్‌తో కలిసి ఉమ్మడిగా సదస్సులు, సమావేశాలు, వర్కుషాప్‌లు నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే వీలైతే యూజీ, పీజీ విద్యార్ధులకు సైతం పున:శ్చరణ తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు.

అనిల్‌కే మోదీ కాపలాదారు!

రాయ్‌పూర్, అక్టోబర్ 22:ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చౌకీదారు కాదని, పారిశ్రామిక అంబానీకే కాపలాదారు అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. సోమవారం ఇక్కడ జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన రాహుల్ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కుమార్తె పంజాబ్ నేషనల్ బ్యాంకును ముంచేసిన మెహుల్ చోక్సీ నుంచి డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. బెదిరింపులు, అణచివేత హెచ్చరికల కారణంగానే మీడియా ఈ అంశానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు.

Pages