ఎడిట్ పేజీ

రష్యాపై సానుకూల ధోరణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇద్దరు ప్రేమికుల మధ్య విషాందాంత ప్రేమ కథ మాదిరిగా రష్యా-పశ్చిమదేశాల వ్యవహారశైలి కొనసాగుతోం ది. వీరికి పరస్పర సంబంధాలు కొనసాగించాలనే ఉంది కానీ ఎక్కడినుంచి, ఏవిధంగా మొదలుపెట్టాలో తెలియకపోవడమే విషాదం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, జర్మన్ ఛాన్సలర్ ఆంజెల్లా మార్కెల్‌కు ఫోన్ చేసి ఉక్రెయిన్ సరిహద్దు నుంచి తమ దళాలను ఉపసంహరించుకుంటామని తెలిపారు. మరి అమెరికా రక్షణ మంత్రి జాన్ కెర్రీ, రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయ్ లోవ్‌రోవ్‌ల మధ్య ఈ మధ్య పారిస్‌లో జరిగిన సమావేశం ఏవిధమైన ఫలితాలివ్వకుండానే ముగిసింది. ఇదేసమయంలో రష్యాపై ఆంక్షలను మరో ఆర్నెల్లపాటు పొడిగిస్తూ యూరోపియన్ యూనియన్ దేశాలు నిర్ణయించడం మరో విచిత్రం. కాగా ఐరోపా యూనియన్‌లోని దక్షిణప్రాంత దేశాలు రష్యాపై ఆంక్షల విధింపును వ్యతిరేకిస్తున్నాయి. ఈయూ దేశాల మధ్య విభేదాల నేపథ్యంలో రష్యాపై ఆంక్షలు నిరవధికంగా కొనసాగే అవకాశం లేదు. ఈ పరిస్థితి చూస్తుంటే రష్యా-అమెరికాలు ఒకరిపై మరొకరు పరస్పర అపనమ్మకాలతోనే అడుగులు ముందుకేస్తున్నారు తప్ప, విశ్వాసం పాదుకొనడం లేదు. పశ్చిమదేశాల్లో వ్యక్తమవుతున్న ఈ సరికొత్త మూడ్‌కు సెంట్‌పీటర్స్‌బర్గ్‌లో జరిగిన వార్షిక ఆర్థిక సదస్సే కొలమానం. గత ఏడా ది క్రిమియా సంక్షోభం పతాకస్థాయిలో కొనసాగుతున్న తరుణంలో..దావోస్ సదస్సులోరష్యా తన వాదనలు వినిపించే సమావేశానికి హాజరు కావద్దంటూ అమెరిగా ఆంతరింగికశాఖ, దేశంలోని పెద్ద కార్పొరేషన్లను ఆదేశించింది. మరి ఈ ఏడాది అమెరికాకు చెందిన అతిపెద్ద కార్పొరేట్ సంస్థలు, యూరోపియన్ యూనియన్‌కు చెందిన ఇంధన దిగ్గజాలు, రష్యాతో వ్యాపారం చేయడానికి ఎంతో ఉత్సాహం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇంధన రంగంలో.
పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయి ఉన్న గ్రీస్ ప్రధాని అలెక్సి పీటర్‌బర్గ్‌కు సెంట్‌పీటర్స్‌బర్గ్‌లో మంచి స్వాగతం లభించగా, ఇటలీ ప్రధాని మాట్టెవోరెన్‌జి మాస్కోలో పుతిన్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా రష్యాలో ఇటలీ ప్రధానికి రెడ్‌కార్పెట్ స్వాగతం లభించడం విశేషం. నిజం చెప్పాలంటే గ్రీస్ ఆర్థిక అవసరాలు, రష్యా అందచేయగలిగే సహాయానికి అందనంత ఎత్తు లో ఉన్నాయి. ఇటలీ ప్రధాని పర్యటన సం దర్భంగా రష్యాతో గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణంపై ఒప్పందం కుదిరింది. యూరోపియన్ యూనియన్‌కు చెందిన ఈ ఇద్దరు నేతల వ్యవహారశైలి ఇబ్బంది కలిగించేదే. ఎగుమతులు, వాణిజ్యం ద్వారా పురోభివృద్ధి సాధనకు ఈ ఆంక్షలు పెద్ద గుదిబండగా మారాయని గ్రీస్,ఇటలీ దేశాలు భావిస్తున్నాయి. తమదేశంలోని పరిశ్రమల వాణిజ్య అవకాశాలను ఈ ఆంక్షలు నిరోధిస్తున్నాయని కొన్ని యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా అసంతృప్తిని వెళ్లగక్కుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో యూరోపియన్ యూనియన్‌లో కొనసాగుతున్న విభేదాలను సొమ్ము చేసుకోవాలని రష్యా యత్నించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
రష్యా,పశ్చిమ దేశాల మధ్య కొనసాగుతున్న ఈ రకమైన పరస్పర ఆకర్షణకు కారణం... ఆంక్షలు ఇంక ఏమాత్రం పనిచేయబోవన్న అసలు వాస్తవం క్రమంగా అవగాహనకు రావడమే. ఉక్రెయిన్ అంశంపై రష్యా చేసిన మిన్‌స్క్-2 ఒప్పందంపైనే యూరోపియన్ యూనియన్ దేశాల ఆశలన్నీ కేంద్రీకృతమై ఉన్నాయి. ఇదిలావుండగా కీవ్ దళాలు, రష్యా మద్దతు కలిగిన వేర్పాటువాదుల మధ్య పెరుగుతున్న పోరాట తీవ్రత వల్ల ఉక్రెయిన్, జర్మనీలపై క్రమంగా ఒత్తిడి అధికమవుతోంది. రెండు వర్గాల మధ్య మధ్యవర్తిగా వ్యవహరించిన యాంజెల్లా మార్కెల్, ఒప్పందం విషయంలో ఇప్పటికీ కట్టుబడి ఉండటమే కాదు, ఇరుపక్షాల మధ్య రాజీ కుదరడానికి ఈ ఒప్పందం ఎంతో ఉపయోగపడుతుందన్న విశ్వాసంతో ఉన్నారు. కానీ రెండు వర్గాల మధ్య ఒకవైపు కాల్పులు కొనసాగుతున్న తరుణంలో, ఒప్పందంలో పేర్కొన్న అధికార వికేంద్రీకరణ దిశగా ముందుకు వెళ్లడం సాధ్యం కాదన్న సంగతిని అన్ని దేశాలు ఇప్పటికే గుర్తించాయి.
ఇక యూరోపియన్ యూనియన్ విషయం అట్లా ఉంచితే.. రష్యాతో ఒక అవగాహనకు వచ్చే తరుణం ఆసన్నమైందని అమెరికా కూడా క్రమంగా గుర్తిస్తున్నది. రెండు పక్షాలు తమ బలాల గురించి నగారా మోగించాయి. తన అణ్వస్త్ర పాటవాన్ని ప్రదర్శించడం, సైన్యాన్ని ఎప్పటికప్పుడు ఆధునికీకరించే ప్రక్రియ చేపట్టడం ద్వారా రష్యా తన బల ప్రదర్శన చేపట్టింది. మరోవైపు అమెరికా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) పునరుద్ధరణ కార్యక్రామాలు చేపట్టింది. ఇందులో భాగంగానే రష్యా సరిహద్దు ప్రాంతంలో భారీ యెత్తున సైనిక సామగ్రిని తరలించడమే కాదు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను సిద్ధం చేస్తోంది. అమెరికా ఈ చర్యలను చేపట్టింది కేవలం ఇప్పటికే ధైర్యం కోల్పోయి ఉన్న నాటో దేశాల్లో ధైర్యం నింపేందుకు తప్ప, వాటిల్లో తిరిగి చైతన్యం నింపడానికి మాత్రం కాదు. ఈ కారణాలన్నింటి నేపథ్యంలో ఇప్పుడు చర్చలకు వేదిక సిద్ధమైంది. ఇకముందు రష్యాకు వ్యతిరేకంగా ఆంక్షలు విధించే పరిస్థితి ఉండకపోవచ్చు. అటువంటి పరిస్థితే వస్తే దాన్ని వ్యతిరేకించేందుకు యూరోపియన్ యూనియన్ దక్షిణ ప్రాంత దేశాలు ఉండనే ఉన్నాయి. దీనికితోడు ఒబామా యంత్రాంగం మరింత ముఖ్యమైన విస్తృత భౌగోళిక సమస్యల చిక్కుముడులను విప్పాల్సి ఉంది. ఇస్లామిక్ స్టేట్ లేదా ఐఎస్‌ఐఎస్ సిరియా ఇరాక్‌ల్లో మారణకాండకు పాల్పడుతూ ముందుకు దూసుకెళుతోంది. అమెరికా దాని సంకీర్ణ దళాలు జరిపిన బాంబు దాడులు ఐఎస్ పురోగమనాన్ని నిలువరించలేకపోవడం అటువంటి సమస్యల్లో ఒకటి.
ఆర్థిక నియంత్రణల పేరుతో గత ప్రభుత్వాలు అనుసరించిన కఠిన వైఖరికి విసిగిపోయిన గ్రీస్ ప్రజలు మొట్టమొదటిసారి వామపక్ష ప్రభుత్వానికి పట్టం కట్టారు. ప్రస్తుతం గ్రీస్ ఋణదాతల ముట్టడిలో సతమతమవుతోంది. ఒకపక్క రుణ దాతలతో ఒప్పందం కుదుర్చుకోవడానికి చర్చలు కొనసాగతున్న తరుణంలోనే మరోపక్క యూరోపియన్ దేశాల మెడకు మరో సమస్య చుట్టుకుంది. విపరీతంగా వచ్చిపడుతున్న వలస ప్రజల సమస్య వాటిని కుదిపేస్తోంది. ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఈ వలసలకు వ్యతి రేకత వ్యక్తమవుతోంది. ఐరోపా దేశాల్లో వలసలకు వ్యతిరేకత బాగా పెరుగుతున్నదనడానికి ఇటీవల జరిగిన డేనిష్ ఎన్నికలే నిదర్శనం. అక్కడ వలసలను వ్యతిరేకించే పార్టీ అధికారంలోకి వచ్చింది.
ఇక బ్రిటన్ విషయానికి వస్తే యూరోపియన్ యూనియన్‌లో సభ్యదేశంగా కొనసాగాలా? వద్దా? అనే డైలమా వెన్నాడుతోంది. అధికార కన్జర్వేటివ్ పార్టీలోని హార్డ్ లైనర్లు కూడా ఈయూ నుంచి బయటకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈయూలో కొనసాగాలా? వద్దా? అనే అంశంపై రెఫరెండం నిర్వహించాలని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ నిర్ణయించారు. ప్రజల్లో వ్యక్తమవుతున్న భావాలకు అనుగుణంగానే బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ, విదేశాలనుంచి వలస వచ్చేవారి భారాన్ని మిగిలిన యూరోపియన్ యూనియన్ దేశాలతో కలిసి పంచుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేదు. ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను ఇటలీ, గ్రీసు దేశాలకే వదిలేసింది. వలస వచ్చిన ప్రజల బాధ్యతను సమానంగా భరించాలని గతంలో ఈయూ దేశాలు ప్రతిపాదించాయి.
పై మూడు రకాల తీవ్ర సమస్యలతో బాధపడుతున్న యూరోపియన్ యూనియన్ దేశాలు, తాజాగా రష్యాతో సరికొత్త ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగించడానికి ఏమాత్రం సిద్ధంగాలేవు. ఇప్పటికే ప్రపంచంలో సంఘర్షణలు కొనసాగుతున్న ప్రాంతాల్లో రష్యా ప్రయోజనాలు ముడివడి ఉన్నాయి. అందువల్ల ఆయా ప్రాంతాల్లో సమస్యల పరిష్కారం విషయంలో పశ్చిమదేశాలకు సహాయపడగలదు. ఇరాన్ అణు కార్యక్రమం విషయంపై చరిపే చర్చల్లో ఇప్పటికే రష్యా భాగస్వామిగా ఉంది. ఇరాక్‌లో బషర్ అల్ అసాద్ ప్రభుత్వానికి రష్యా మద్దతునిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో రష్యాతో రాజీకి రావడానకి అమెరికా సిద్ధంనే ఉన్నప్పటికీ ఇంకా రెండు దేశాల మధ్య కొనసాగుతున్న అపనమ్మకాలు అడుగు ముందుకు పడనీయడంలేదు. ముఖ్యంగా రష్యాపై విధించిన ఆర్థిక ఆంక్షల ప్రభావం ఒప్పందం కుదరడానికి పెద్ద అడ్డంకిగా మారింది. చూస్తుంటే యూరప్ దేశాలు కొద్దికాలంగా సమస్యల ఊబిలో చిక్కుకొని ఊపిరి ఆడని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ముఖ్యం గా విస్తరిస్తున్న ఛాందసవాదం ప్రమాదకరంగా పరిణమిస్తోంది.
సార్వభౌమాధికారం స్థానే, యూరోపియన్ యూనియన్‌కు ప్రధాన ఆధారంగా మారిన జాతీయశక్తి అనే పదం ఇప్పుడు ఒక ఫ్యాషన్‌గా మారింది. 2017లో ఫ్రాన్స్‌లో జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో నేషనల్ ఫ్రంట్ పార్టీ అభ్యర్థి మారిన్ లీ పెన్ ‘సంప్రదాయ వివేచన’ అనే నినాదంతో ప్రచారబరిలో దిగనున్నాడు. యూరోపియన్ యూనియన్ పార్లమెంట్‌లో ప్రస్తుతం ఛాందస పార్టీలన్నీ ఒక బ్లాక్‌గా ఏర్పడటం గమనించాల్సిన పరిణామం. ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ దేశాల్లో నెలకొన్న గందరగోళ పరిస్థితిని చూస్తుంటే రానున్న కాలంలో బ్రెడ్ అండ్ బటర్ సమస్య తిరిగి ప్రధాన పాత్ర పోషిస్తుందనడంలో ఏమాత్రం సందేహంలేదు. ఈ నేపథ్యంలో రష్యా కారణంగా ఉత్పన్నమయ్యే భౌగోళిక సమస్యలు కేవలం రెండో స్థానాన్ని మాత్రమే ఆక్రమించగలవు. చారిత్రక, భౌగోళిక కారణాలను చూపుతూ పోలెండ్, బాల్టిక్ దేశాల్లో ఛాందసవాదులు ఆధిపత్యం వహిస్తున్నారు. అయితే రష్యాతో స్నేహ సంబంధాలు కోరుకుంటున్న వారి సంఖ్య వీరికంటే చాలా అధికంగా ఉండటం గమనార్హం. ఇదిలావుండగా ఉక్రెయిన్ సమస్య సరికొత్త కోణంలో కొనసాగుతోంది. ముఖ్యంగా రష్యా అనుకూల, పశ్చిమ దేశాల అనుకూల భావాలు కలిగిన ప్రజల వల్ల ఉత్పన్నమైన ఈసమస్య ఎక్కడితో ముగుస్తుందో వేచి చూడాల్సిందే.
చిత్రం.. ఉక్రెయన్ సమస్యపై పై రష్యా-ఈయూ దేశాల నేతల సదస్సులో పాల్గొన్న నేతలు