Others

ఫేస్‌బుక్ పరిచయాలా.. తస్మాత్ జాగ్రత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమెయిల్స్, చాటింగ్, ఫేస్‌బుక్‌ల వలన వేధింపులకు గురి అయ్యేవారు చేసే ఫిర్యాదులు అన్ని సైబర్ నేరాల క్రిందకు వస్తాయి. మన దేశంలో నమోదు అయిన కేసులలో 46 శాతం తాము వేధింపులకు గురవుతున్నామంటూ మహిళలు చేసిన ఫిర్యాదులు ఉండటం గమనార్హం. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ విడుదల చేసిన గణాంకాలే.
**
ఆనందం, విషాదం అనేవి నాణేనికి బొమ్మ-బొరుసు ఏలానో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా నాణెం వంటిది. ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల మహిళలపై సైబర్ నేరాలు అధికమవుతున్నట్లు నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ వివరాలు తెలియజేస్తున్నాయ. వయోభేదం లేకుండా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్, వాట్సాప్‌లను వినియోగించుకొంటున్నారు. వీటిని వినియోగిస్తున్నారు అనడంకన్నా వాటికి బానిసలు అయ్యారు అనడం సబబుగా ఉంటుంది. ఫేస్‌బుక్ ద్వారా కొత్త, కొత్త పరిచయాలు అవ్వడం, గంటల తరబడి చాటింగ్ చేయడం నేడు మామూలైపోయింది. అయితే ఈ నేపథ్యంలో నష్టపోతున్నది మాత్రం మహిళలే కావడం గమనార్హం. గంటల తరబడి చాటింగ్‌లు చేయడంవలన భార్యాభర్తలమధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. చాలా కాపురాలు కుప్పకూలిపోతున్నాయి. కొందరు మారుపేర్లతో ఇతరుల ఫొటోలతో ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్లను ప్రారంభించి, మెల్లగా అమాయక మహిళలను ట్రాప్ చేస్తున్నారు. వీరు మహిళలతో ప్రేమగా, కడు నేర్పరితనంతో మాట్లాడుతూ వారికి అత్యంత ప్రీతిపాత్రులవుతున్నారు. మహిళలు కూడా అమాయకంగా వారికి తమకు సంబంధించిన అన్ని విషయాలు, వివిధ భంగిమలో తమ ఫొటోలను పంపుతున్నారు. ఇక అప్పటినుంచి చివరికి వేధింపులు ప్రారంభం అవుతాయి. ఇందుకు సంబంధించిన వాస్తవ గాధలు కొన్ని.
ప్రేమ మైకంలో..
ప్రీతి (పేరు మార్చబడింది)కి ఫేస్‌బుక్ ద్వారా ఒక యువకుడు పరిచయం అయ్యాడు. చాటింగ్ ద్వారా వారిరువురు మరింత చేరువై ప్రేమలో పడ్డారు. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మనం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం కదా, నీ న్యూడ్ (నగ్న) ఫొటోలు పంపమని కోరగానే, ప్రేమ మైకంలో వున్న ప్రీతి తన నగ్న ఫొటోలు పంపించింది.
అప్పటినుంచి ప్రీతికి వేధింపులు ప్రారంభం అయ్యాయి. తనకు డబ్బు ఇవ్వకపోతే నగ్న చిత్రాలను ఇంటర్నెట్‌లో పెడతానంటూ బ్లక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. దీంతో ఖంగుతిన్న ఆమె తనకు బ్లాక్‌మెయిల్ నుంచి రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించింది.
విడాకులకు దారితీసింది..
శాంతి (పేరు మార్చబడింది) ఉన్నత విద్యావంతురాలు. చదువుకొనే సమయంలో ఉద్యోగం చేస్తూన్న సమయంలో తన స్నేహితులతో విహారయాత్రలకు వెళ్లి, వివిధ భంగిమలతో తాను తీయించుకున్న ఫొటోలను కంప్యూటర్(లాప్‌టాప్)లో భద్రపరచుకొంది. తరచుగా తన స్నేహితులతో చాటింగ్ చేస్తుండేది. రెండు సంవత్సరాల క్రితం ఆమెకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో వివాహం అయింది. ఆమె తన లాప్‌టాప్‌లో వున్న ఫొటోలు, చాటింగ్‌లను సీక్రెట్ కోడ్ ద్వారా నిక్షిప్తం చేసింది. ఇటీవల, లాప్‌టాప్ ద్వారా చాటింగ్ చేస్తున్న సమయంలో ఫోన్ వస్తే మాట్లాడుతూ, లాప్‌టాప్ విషయం మరచిపోయింది. అదే సమయంలో ఇంటికి వచ్చిన ఆమె భర్త లాప్‌టాప్‌లో వున్న ఫొటోలు, చాటింగ్‌లు చూసి ఖంగుతిన్నాడు. దీంతో వారిరువురిమధ్య గొడవలు ప్రారంభమై ఘర్షణగా మారి, చివరకు విడాకులు తీసుకొన్నారు.
భర్త చేతిలో ప్రాణాలు కోల్పోయంది..
జ్యోతి (పేరు మార్చబడింది) వివాహమై 20 సంవత్సరాలు అవుతోంది. ఆమె భర్త ఉన్నత ఉద్యోగి. వీరికి ఇరువురు పిల్లలు. వీరిది అన్యోన్య దాంపత్యం. ఏ ఫంక్షన్ జరిగినా భార్యాభర్తలు ఇరువురు కలిసి వెళతారు. చుట్టుప్రక్కలవారు వీరిని ఆదిదంపతులు అని ముద్దుగా పిలిచుకొంటారు. ఆనందంగా సాగుతున్న వారి జీవితంలో ఆండ్రాయిడ్ ఫోన్ చిచ్చుపెట్టింది. తమ హోదాకు తగ్గట్టుగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఆమె భర్త ఆమెకు ఆండ్రాయిడ్ ఫోన్ బహుమానంగా ఇచ్చాడు. సదరు ఫోన్‌వల్లనే తాను ప్రాణాలు కోల్పోతానని జ్యోతికి, తాను హంతకుడిని అవుతానని ఆమె భర్తకు తెలియదు. జ్యోతికి ఫేస్‌బుక్‌ద్వారా ఒక వ్యక్తితో పరిచయం అయింది. ఆమె తరచూ చాటింగ్ చేయడం ప్రారంభించింది. మామూలు విషయాలతో ప్రారంభం అయిన చాటింగ్ చివరకు శృంగార విషయాలవరకూ వెళ్లింది. ఈ నేపథ్యంలో జ్యోతి ఫోన్‌లో వున్న చాటింగ్ వివరాలు ఆమె భర్త కంట్లో పడ్డాయి. దీంతో వారిరువురి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగి, చివరకు ఘర్షణగా మారింది. ఈ ఘర్షణలో భర్త కొట్టిన దెబ్బలకు జ్యోతి విగతజీవురాలైంది. ఆమె భర్త హంతకుడై శ్రీకృష్ణజన్మస్థానానికి వెళ్లాడు. పిల్లలు అనాథలు అయ్యారు. ఇటువంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే వున్నాయి. ఫేస్‌బుక్ పరిచయాలను నియంత్రణలో ఉంచకపోతే, తీవ్రంగా నష్టపోతున్నది మహిళలే. కాబట్టి మహిళలారా.. ఫేస్‌బుక్‌ను పరిమితికి మించి వినియోగించారో కష్టాలు కొనితెచ్చుకున్నట్లే.. తస్మాత్ జాగ్రత్త!

- పి.హైమావతి