హైదరాబాద్

నాలా పూడికతీతలో అవకతవకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 11: నగరంలోని నాలా పూడికతీత పనులకు సంబంధించి సెంట్రల్ జోన్‌లో వెలుగు చూసిన నకిలీ బిల్లుల వ్యవహారానికి సంబంధించి మరో పది మంది ఇంజనీర్లు, ఇతర సిబ్బందిపై వేటు పడే అవకాశముంది. సెంట్రల్ జోన్‌లోని వివిధ నాలాల నుంచి బయటకు తీసిన పూడికను తొలగించినట్లు, అందుకు వినియోగించిన వాహనాల నెంబర్లను సమర్పిస్తూ వచ్చిన బిల్లులను విజిలెన్స్ అధికారులు లోతుగా పరిశీలించగా, ఆ నెంబర్లన్నీ కూడా ద్విచక్ర, త్రి చక్ర వాహనాలకు చెందినవిగా బయట పడటంతో సంబంధిత ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలంటూ కమిషనర్ జనార్దన్ రెడ్డి సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఇప్పటి వరకు 13 మంది ఇంజనీర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయటంతో పాటు వారిపై సస్పెన్షన్ వేటు కూడ వేసిన సంగతి తెలిసిందే! గతంలో కేవలం ఎండాకాలం మాత్రమే పరిమితమైన ఈ నాలాల్లోని పూడికతీత పనులను కమిషనర్‌గా జనార్దన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏడాది పొడువునా చేపట్టాలని ఆదేశించారు. అంతేగాక, ప్రతి పనిని సోషల్ ఆడిట్ చేయాలని కూడా సూచించారు. అయితే సెంట్రల్ జోన్‌లో పలు నాలాల్లోని పూడికతీసినట్లు, ఆ పూడికను తరలించిన వాహనాల నెంబర్లు బోగస్‌గా తేలిన ఘటన విధితమే. ఇందుకు సంబంధించి నాలాల పూడికతీత పనుల పర్యవేక్షణ, పూడికతీత తరలింపు వంటి విధులను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాల్సిన మరో పది మందిలో కొందరు ఇంజనీర్లు, ఇతర సిబ్బంది కూడా విధులను నిర్లక్ష్యం చేసినట్లు, మరికొందరు అడ్డదారిలో బిల్లులు డ్రా చేయాలనుకున్న వారితో కుమ్మకైనట్లు గుర్తించిన అధికారులు వారిపై కూడా చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతున్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి. పూడికతీతకు సంబంధించి బోగస్ బిల్లుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుండటంతో సెంట్రల్ జోన్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అంతేగాక, ప్రస్తుతం అయిదు జోన్లలో జరుగుతున్న నాలాల పూడికతీత పనులు, సొషల్ ఆడిట్ అంశాలతో పాటు పూడికను డంపింగ్ యార్డుకు తరలించినట్లు బిల్లుల్లో పేర్కొన్న వాహనాల నెంబర్ల కూడా పూర్తి స్థాయిలో మరో సారి విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. తాజాగా మరో పది మందిపై వేటు వేసేందుకు రంగం సిద్దం కావటంతో ఆ జాబితాలో ఎవరెవరున్నారన్న విషయం ఇంజనీర్లు, ఇతర సిబ్బందిలో చర్చనీయాంశమైంది.