విజయనగరం

జగన్ ప్రధానిని కలిస్తే మాకేం ఇబ్బంది లేదు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మే 12: తెలుగుదేశం పార్టీ బాధ్యత గల పార్టీ అని, వైకాపా నేత జగన్ ప్రధాని మోదీని కలవడం వల్ల మాకేమీ ఇబ్బంది లేదని, మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు స్పష్టం చేశారు. శుక్రవారం జెడ్పీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన విలేఖరులు అడిగిన ప్రశ్నకు పైవిధంగా స్పందించారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని జగన్ విమర్శించడంపై గతంలో ఇతర పార్టీల నుంచి 26 మంది ఎమ్మెల్యేలు వైకాపాలో చేరినపుడు వారిని రాజీనామా చేసి ఆ పార్టీలోకి ఆహ్వానించలేదు కదా? అని ప్రశ్నించారు. ఆ సమయంలో తాను, మరో ఎమ్మెల్యే మాత్రమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆ పార్టీలో చేరామని గుర్తు చేశారు. అంతరాష్ట్ర వివాదంగా మిగిలి ఉన్న జంఝావతి సమస్య ఎప్పటికి పరిష్కారమవుతుందని అడగ్గా మరో 10 రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని, త్వరలోనే ఒడిశా ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తామని బదులిచ్చారు. జిల్లాలో తాగునీటికి అధిక ప్రాధాన్యతనిస్తామన్నారు. జిల్లాలో 26 శాఖలకు ఇన్‌ఛార్జిల పాలన కొనసాగుతున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురాగా దీనిపై దృష్టిసారించామని ఈ నెలలోనే వాటిని భర్తీ చేస్తామని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే చిరంజీవులు పాల్గొన్నారు.

తేనెటీగల దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలు...!
* ఒకరి పరిస్థితి విషమం...విశాఖ తరలింపు...

పార్వతీపురం (రూరల్), మే 12: తేనెటీగల దాడిలో ఇద్దరికి తీవ్రగాయాలైన సంఘటన శుక్రవారం బెలగాంలోని మున్సిపల్ వాటర్ ట్యాంకర్ వద్ద చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఆసుపత్రి వర్గాలు, మున్సిపల్ సిబ్బంది అందించిన వివరాలిలా ఉన్నాయి. రాయగడకు చెందిన తగరాడ అశోక్‌కుమార్, ఉల్లిభద్రకు చెందిన రౌతు లక్ష్మణరావులు డిప్లొమా చదువుతున్నారు. వారి చదువులో భాగంగా మున్సిపాల్టీలో అప్రంటీస్ చేసేందుకు ఐదుగురు విద్యార్థులు నాలుగు రోజుల క్రితం వచ్చారు. వీరు మున్సిపల్టీలోని నీటి సరఫరా, ట్యాంకుల వివరాలు తదితర వాటిపై క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం బెలగాంలోని నీటి రిజర్వాయర్ల చుట్టుకొలత, ఎత్తు కొలిచేందుకు ఎక్కారు. ఈ తరుణంలో ఆ రిజర్వాయర్లకు ఉన్న తేనెటీగలు వారిపై దాడి చేశాయి. దీంతో వారు వాటి బాధ భరించలేక ఎత్తుగా ఉన్న రిజర్వాయర్ నుండి పడిపోయారు. దీంతో ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి. ఓ వైపు తేనెటీగల దాడితోపాటు ఎత్తునుండి పడిపోవడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. అక్కడే ఉన్న మున్సిపల్ సిబ్బంది అప్రమత్తమై వారిని సమీపంలో ఉన్న ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆ ఇద్దరిలో అశోక్‌కుమార్ పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు ప్రథమ చికిత్స అందించి విశాఖ తరలించారు. అయితే ఆయా వాటర్ ట్యాంకులకు తేనెటీగల పట్లు గత కొంతకాలంగా ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని స్థానికులంటున్నారు.