Others

రూటుమార్చిన సినిమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరు నా సహోదరులు..’ పిల్లల పాఠ్య పుస్తకాల్లో ఉండే ‘ప్రతిజ్ఞ’లోని తొలి వాక్యాలివి. వీటిని సినిమా వాళ్ళు వందశాతం నిజం చేసే రోజులొచ్చేశాయి. కాస్త మారిస్తే..-
‘భారతదేశం నా మాతృభూమి. భారతీయ సినిమాలన్నీ నాకొక్కటే...’’ ఈ సరికొత్త సినిమా వాక్యానికి బలం చేకూర్చారు హిందీ నటదిగ్గజం, బాక్సాఫీసు రికార్డుల క్రియేటర్ అమీర్‌ఖాన్. దంగల్ -బాహుబలి సినిమాలను ఉద్దేశించి ‘రెండూ భారతీయ సినిమాలే. రెండూ అఖండ విజయం సాధించడం గర్వంగా ఉంది’ అంటూ ఆ మధ్య ఆయన చేసిన ట్వీటు వ్యాఖ్యానం భారతీయ బహుభాషా సినిమా రంగం గుండె చప్పుళ్లను బలంగా వినిపిస్తోంది. అవును మరి. సినిమాపరంగా ప్రాంతీయతకి ఇప్పుడు హద్దులు చెరిగిపోయాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ అంటూ సినిమాల్ని వేరుచేసి చూడకుండా -ఇది భారతీయ సినిమా అంటూ అన్ని ప్రాంతాలవారూ గర్వంగా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఒకరినొకరు కలుపుకుంటూ ముందుకు వెళ్ళకపోతే, ఒంటరిగా మిగిలి అపజయాల బాట పట్టే వేళ వచ్చేసింది. జై ఇండియా! జైజై ఇండియన్ సినిమా!
ఉత్తరాది భాషల (బాలీవుడ్) సినిమాలూ మనవేనంటూ దక్షిణాది వాళ్లు హృదయాలకు హత్తుకొని హిట్ చేస్తోన్న సందర్భాలు ఇటీవల కోకొల్లలు. ఇటునుంచి అడుగుపడితే అటునుంచీ అడుగుపడుతుందన్నట్టు -బాహుబలి మా సినిమానే అంటూ బాలీవుడ్ నెత్తికెత్తుకుంది. దక్షిణాది నిర్మాణాన్ని గుండెకు హత్తుకుని ఉత్తరాది ప్రేక్షకులు హిట్టిచ్చారు. ఇది మనందరి సినిమా, భారతీయ సినిమా అని ముక్తకంఠంతో నినదించేలా అఖండ విజయం అందించి కొత్త పరిణామానికి పునాది వేసింది. అందుకే అమీరఖాన్ ‘బాహుబలి’ని మన సినిమా, భారతీయ సినిమా అనగలిగాడు. దక్షిణాది, ఉత్తరాది హద్దులు చెరిపేసి అటూ, ఇటూ భారతీయత’ను బలంగా చాటే సినిమాలు వస్తున్నాయి. ప్రేక్షకులూ అలానే ఆదరిస్తుండటం -పరిశీలించదగ్గ పరిణామం. అందుకే, ఇపుడిపుడే మన వాళ్ళంతా వందల కోట్లతో సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నారు. కోట్లు కొల్లగొట్టాలనే కాదు, కోట్లాది భారతీయ ప్రేక్షకుల హృదయాలనూ కొల్లగొట్టాలని యోచిస్తున్నారు.
ఒకరకంగా చెప్పాలంటే, ఏ భాషవాళ్ళు ఆయా భాషలో సినిమా తీసేసి, ఆ ప్రాంతం వరకే విడుదల చేసేసుకొనే పద్ధతికి తిలోదకాలిచ్చేశారు. ఇందుకు రాబోతున్న లేదా ప్రకటించబడిన పలు చిత్రాలే ప్రత్యక్ష ఉదాహరణ. తమిళ దర్శకుడు సి సుందర్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రాణి ‘సంఘమిత్ర’ని సుమారు 250 కోట్లతో తెరపైకి తేనున్నారు. ఇక ఎప్పుడో ప్రకటించిన చిరంజీవి ‘ఉయ్యాలవాడ...’ (100-200 కోట్ల మధ్య) సినిమానీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తీయాలన్నది యూనిట్ యోచన. అలాగే, రజనీ ‘కాలా’ చిత్రాన్నీ తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో చిత్రీకరిస్తారని భోగట్టా.
మరాఠా యోధుడు భారతీయుల వీరత్వానికి ప్రతినిధి ‘శివాజీ’ ధీర గాథను (సుమారు 225 కోట్లతో) భారతీయ సినిమాగా మలచాలన్నది బాలీవుడ్ హీరో రితీశ్ దేశ్‌ముఖ్ తాజా ఆలోచన. అలాగే అల్లు అరవింద్ మరిద్దరి నిర్మాతల సహకారంతో (సుమారు 500 కోట్లతో) తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రామాయణ మహా కావ్యానికి తెర రూపమివ్వాలన్నది సంకల్పం. ఆల్రెడీ ప్రకటించేశారు కూడా! ఇక కా.బి.ఆర్.శెట్టి అయితే ఏకంగా (వేయి కోట్లతో) తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ, ఆంగ్ల భాషల్లో మహాభారతానికి రూపకల్పన చేయబోతున్నాడని కబురు. (రెండు భాషల్లో తీస్తున్న సినిమాల ప్రస్తావన తేలేదు వ్యాసంలో). ఒకప్పుడు ఒక మాట తరుచూ వినిపించేది. హిందీని ప్రాచీన భాషల్లోకి, తెలుగుని తమిళంలోకి, కన్నడని తెలుగులోకి.. ఇలా సినిమాల్ని రీమేక్ చేసినపుడు ఆయా నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేశామని. అందుకు తగినట్టే సినిమాని చుట్టేసేవారు. కానీ కథ పగడ్బందీగా ఉంటే, సినిమాని పక్కాగా తీయగలిగితే... ఎవరైనా, ఏ భాషవారైనా, ఏ ప్రాంతం, ఏ దేశం వారైనా ఆదరిస్తారని, అక్కున చేర్చుకుంటారని ఇపుడిపుడే సినిమా రంగం వారికి అవగతమవుతోంది. మన భారతీయ ‘దంగల్’ చైనాలో 750 కోట్ల వసూళ్ల వర్షం కురిపించడాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. సినిమా ఎక్కడైనా సినిమానే! ఆ భావోద్వేగాలు, ఆ నవరస సమ్మేళితాలు అందరికీ ఒక్కటే అని ఫ్రెష్‌గా నిరూపిస్తున్నారు.
అందుకే అన్ని భారతీయ భాషల్ని కలుపుకుంటూ ‘్భరీ’గా సినిమా నిర్మాణానికి తలపడుతున్నారంతా! ఎవరు తీసినా, ఏ ప్రాంతం నుండి వస్తున్నా, మన భారతీయులంతా ఇది మన సినిమా, మనందరి సినిమా, ముఖ్యంగా భారతీయ సినిమా అని సగర్వంగా ముక్తకంఠంతో ప్రకటించుకునే రోజులు వచ్చేశాయి. హాట్సాఫ్ టు సినిమా.

-ఎనుగంటి వేణుగోపాల్