అంతర్జాతీయం

మోదీ వ్యాఖ్యలను స్వాగతించిన చైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూన్ 5: సరిహద్దుల విషయమై భారత్-చైనా మధ్య కొనసాగుతున్నప్పటికీ ఇరు దేశాల సరిహద్దు వద్ద గత 40 ఏళ్లలో ఒక్క బుల్లెట్ కూడా పేలలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొద్దిరోజుల క్రితం రష్యాలో చేసిన వ్యాఖ్యలను చైనా స్వాగతించింది. ‘మోదీ చేసిన సానుకూల వ్యాఖ్యలను మేము స్వాగతిస్తున్నాం’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ సోమవారం విలేఖరులకు తెలిపారు. ప్రపంచం పరివర్తన దిశగా ముందుకు సాగుతోందని, దేశాల మధ్య సహకారం, ఒక దేశంపై మరో దేశం ఆధారపడటం ఇటీవలి కాలంలో బాగా పెరుగుతోందని, దీంతో సరిహద్దు వివాదాలను పక్కన పెట్టి వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో భారత్, చైనా పరస్పరం సహకరించుకోవలసిన ఆవశ్యకత ఏర్పడిందని ప్రధాని మోదీ గత వారం రష్యా పర్యటన సందర్భంగా సెయింట్ పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదిక చర్చాగోష్ఠిలో తెలిపారు. దీనిపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి స్పందిస్తూ, మోదీ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని, రెండు పెద్ద దేశాలైన భారత్, చైనా శాంతి, సామరస్యలతో ముందుకు సాగుతూ ద్వైపాక్షిక సంబంధాల్లో స్థిరమైన పురోగతి సాధించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు.