ఐడియా

భలే ఐడియానేనండోయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చివరికి లోపలి లాగులు లాంటి లోదుస్తులు కూడా- ఆడపిల్లల నగా నట్రా సహా నిలువుదోపిడీ చేసేసి పరీక్ష హాలులోకి పంపించినా కాపీలు కొట్టడాన్ని అరికట్టలేకపోతున్నారు మన వాళ్ళు. కానీ ఇతియోపియా అంటే ఆఫ్రికాలో వుంది. ఇదివరకు దీనే్న అబిస్సినియా అనేవాళ్ళు. అక్కడ వాళ్ళు పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో కాపీరాయుళ్ళ ఆటలు కట్టించారు. ఎక్కువగా విద్యార్థులు ఇంటర్‌నెట్‌మీద ‘వైఫై’మీద ఆధారపడి కాపీలు కొడుతున్నారు కదా- అటు పరీక్షలు అనగానే ఇటు ఇంటర్నెట్ కనెక్షన్ బంద్ చేసేస్తున్నారు.. దీంతో పేపర్ లీకులు వాటికి అర్జంటు కాపీలు తయారు అవడం కూడా ఆగిపోతుంది అని ఆశ!
అక్కడ దేశవ్యాప్తంగా 12 లక్షలమంది పోయిన వారం పదో తరగతి పరీక్షలు రాశారు. మరో రెండు లక్షల ఎనభై వేలమంది పనె్నండో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. పోయినేడాది, వాట్స్‌అప్‌లోను ఇతర ఇంటర్నెట్ వెబ్ సైట్లలోను ప్రశ్నాపత్రాలు లీకు అయిపోయా యి. పరీక్షలు వాయిదా వెయ్యవలసి వచ్చింది. అంచేత ఈసారి ముందే జాగ్రత్తపడ్డారు. అప్పుడు ఇంటర్నెట్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియాని కొన్ని గంటలు నొక్కేసి పరీక్షలు పెట్టారు. ఇది పోయిన సంవత్సరం యూనివర్సిటీ ఎంట్రెన్స్ పరీక్షలకి ప్రయోగాత్మకంగా మొదలుపెట్టి ఇప్పటికి మూడుసార్లు సర్వర్స్ మూసేశారు. పరీక్షలలో మోసం చేసేవారి తోక కత్తిరించడమే ఉద్దేశ్యం. వాక్స్వాతంత్య్రం కట్ చేయ డం లాంటి చెడ్డ పనులు మేము చెయ్యం అని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. మేమే కాదు అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలు కూడా కాపీలు కొట్టేవారిని అరికట్టడానికి ఇలా చేస్తున్నాయి. ఉదాహరణకి పోయినేడాది అల్జీరియా కాపీరాయుళ్ల ఆట కట్టించడానికి ఇంటర్నెట్ పీక నొక్కేసింది. అయితే, బ్యాం కింగ్, టికెట్ల బుకింగ్ లాంటి వీటికి ఢోకా వుండదు. ఐడియా బాగుంది కానీ మన వాళ్లకి గాలి బంద్ అయినా ఫర్వాలేదు కానీ ఇంటర్నెట్ లేకపోతే మనం చచ్చిపోమూ?