Others

ఇంటి భాష జ్ఞానానికి పునాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పసిపిల్లలు ఏ స్కూలుకూ వెళ్లకుండానే తమ ప్రయత్నంలోనే కొం త జ్ఞానం సంపాదిస్తారు. ఆ జ్ఞానమే సమాజం ఇచ్చిన కానుక. దానినే ‘నేచురల్ క్యాపిటల్’ అంటాము. ఏ బడికీ వెళ్లకుండా ఒక భాషలో తన భావాన్ని వ్యక్తీకరించటం వల్ల ఆ పిల్లవానికి, సమాజానికి మధ్య వంతెన ఏర్పడినట్టే కదా! ఈ వంతెన ‘ఇంజనీరింగ్’కు కారకుడు ఎవరిని అడిగితే ఈ బిడ్డే కదా! కేవలం ఒక భాష మాత్రమే నేర్చుకోవటం లేదు. ఆ బిడ్డ చేతికి 5 రూపాయల నోటిచ్చి అంగట్లో సరకులు తీసుకురమ్మని పంపితే, ఆ 5 రూపాయల నోటును విభజించడమనేది గణితానికి మూలం కదా! మైండ్‌ను, ఆలోచనలను ఎన్నిరకాలుగా వ్యక్తీకరించవచ్చునో తెలుస్తుంది. 5 రూపాయలను 1+4 అనవచ్చును లేక 1+1+3 అనవచ్చును లేక 2+3 అనవచ్చును. అనగా ఒక ముద్దను విడివిడి భాగాలు చేయటం అని అర్థం. ఈ గణితాన్ని ఆ బిడ్డకు ఎవరు నేర్పారు?
పిల్లలకు సమాజమే మొదటి గురువు. ఆ గురువు నుంచి వచ్చిందే బ్రహ్మవిద్య. ఇంత గొప్ప సంపదను పిల్లల భవితను నిర్మించటంలో ఉపయోగించకుంటే- ప్రకృతి ప్రసాదించిన జ్ఞానం అందించకుండా ఆ పిల్లలను విడదీయటం కాదా? అదే మాతృభాష సంపద. ఆ సంపదే క్రియేటివ్ థింకింగ్‌కు మూలం. జీవితంలో వేరే భాషల భావనను కూడా విని అర్ధం చేసుకొని ఎవరైనా తన మాతృభాషలోకి మార్చుకుంటారు. ఇతర భాషలతో ఏర్పడిన జ్ఞానాన్ని తనకు ప్రకృతి ఇచ్చిన జ్ఞానంలోకి ఒంపుకుంటారు. కానీ మాతృభాషలో వచ్చిన భావనను మార్చలేరు. ఆ జ్ఞానానే్న ‘కోర్ నాలెడ్జి’ అంటాము. ప్రాథమిక స్థాయిలో జ్ఞాన సముపార్జనకు అదే సాధనం, మూలం. ప్రతి దేశానికి ప్రత్యేక కరెన్సీ ఉన్నట్టు, ప్రతి మనిషికి సమాజంలో తన అభిప్రాయాలను చెప్పటానికి మాతృభాషే కరెన్సీ. మాతృభాషలో ఏర్పడిన భావాన్ని ఏ భాషలోనైనా మార్చవచ్చును.
ప్రాథమిక స్థాయిలో విద్యాభ్యాసం మాతృభాషలో జరిగితే ఇంటి సంపదను ప్రత్యక్షంగా వాడుకున్నట్లవుతుంది. కాబట్టి అన్ని దేశాల్లోకూడా శిశువుకు ప్రాథమిక జ్ఞానానికి మాధ్యమం మాతృభాషే. అంతమాత్రం చేత ఇతర భాషలను విసర్జించటం కాదు. అన్ని భాషలకు పునాది మాతృభాష. అది ఇంటి బ్యాంకు. దీనినే హ్యుమనల్ లేక నేచురల్ క్యాపిటల్ అంటాం. అదే క్రియేటివ్ థింకింగ్‌కు మూలం. ప్రపంచంలోని అందరు విద్యావేత్తలు ఈ నేచురల్ క్యాపిటల్‌ను ఉపయోగించుకునే ఆ పిల్లల వ్యక్తిత్వాలను అభివృద్ధిచేసే మార్గాలను అనే్వషించి చూపుతున్నారు. అది ప్రకృతి ప్రసాదించిన ప్రాథమిక జ్ఞానం. అది జ్ఞానానికి పునాది. ప్రాథమిక విద్య తన మాతృభాషలో నేర్చుకోవటం శిశువు హక్కు (చైల్డ్ రైట్). ఆ హక్కును పౌర సమాజం, ప్రభుత్వాలు గౌరవించటమే గాకుండా కాపాడాలి. మనం సివిల్ రైట్స్ కాపాడుతున్నాం. హ్యుమన్ రైట్స్ కాపాడుతున్నాం. కానీ, చైల్డ్‌రైట్‌ను చెరిపేస్తున్నారు. శిశువులు బలహీనులు కాబట్టే వారి హక్కులను కాలరాస్తున్నారు. బలహీనులకు అండగా నిలవటమే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. అన్యాయాన్ని ఎదిరించినవాడే నాకు ఆరాధ్యుడని కాళోజీ అన్నాడు. ఇంటి భాషే అన్ని భాషలకూ మూల భాష.

- చుక్కా రామయ్య