సబ్ ఫీచర్

ఆమె జీవితమే కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటి, జంతు ప్రేమికురాలు ఉత్తర ఉన్ని ‘‘పాదముద్రలు’’ పేరుతో లఘు చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో తన జీవితమే కథ అని ఆమె అంటున్నారు. ఇంతకు ముందు ఉన్ని తీసిన ‘రాండమ్ వరవు, తొమ్మిదవ నెల’ లఘుచిత్రాలు హారర్ తరహాలో ఉండగా.. ఈసారి విభిన్నంగా ఉండాలని జంతువులపై తీస్తున్నారు. వాస్తవంగా ఉన్ని కుక్కలను ఎంతో ఇష్టపడతారు. కుక్కల ప్రేమికురాలిగా గుర్తింపు పొందిన తాను ఈసారి తీసే చిత్రంలోనైనా ఏదైనా భిన్నత్వం ఉంటుందని ప్రేక్షకులు ఆశించటం సహజం. అందుకే ఓ మనిషికి, కుక్క మధ్య నెలకొనే సంబంధ బాంధవ్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఆమె ఈ లఘుచిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ కథలోని ప్రధాన క్యారెక్టర్ సిద్ధికి కుక్కలను విపరీతంగా అసహ్యించుకుంటాడు. ఆ తరువాత అతను ఎలా కుక్కలను ప్రేమిస్తాడనే ఇతివృత్తంగా ఈ చిత్రం సాగుతుంది. ‘కుక్కతో నటింపజేయటం అంటే ఎంతో కష్టం కాని, సిద్ధికి సార్ తోడ్పాటు వల్ల ఈ చిత్రం బాగావచ్చిందని అంటారు. ఈ చిత్రం కథ నా జీవితంలో వాస్తవంగా జరిగిందే. మామో అనే కుక్కతో మా నాన్నకు విపరీతమైన అనుబంధం ఉండేది. ఆ కుక్కను ఇంటికి తీసుకువచ్చినపుడు ఆ మూగజీవాన్ని తల్లిదండ్రులు అసలు పట్టించుకోలేదు. అలాంటిది అది చూపించిన విశ్వాసం, దాని చర్యలు మా నాన్నను ఎంతగానో ఇష్టపడేటట్లు చేశాయి. ఆయనే స్వయంగా వెళ్లి మామోకు ఆహారాన్ని తీసుకువచ్చేవారు. నాకంటే ఆ కుక్క ఎంతో ఇష్టమైంది అని నవ్వుతూ ఉత్తర చెప్పారు.
నేను చిన్నప్పుడు కుక్క కావాలంటే మా అంకుల్ ఓ కుక్కను తెచ్చిచ్చారు. అది నా జీవితంలో ఎంతో సంతోషకరమైన రోజు అని చెప్పవచ్చు. మన ఇంట్లో కుక్క ఉంటే దానితో అనుబంధం చాలా సులువుగా ఏర్పడుతుందని ఆమె అంటారు. నేను ఇప్పటికీ నా కుక్కను ఓ కుటుంబ సభ్యురాలిగా భావిస్తాను. ఈ ‘పాదముద్రలు’ లఘు చిత్రం కూడా ఎంతో మందిని పెంపుడు జంతువులను పెంచుకునేలా మారుస్తుందని ఉత్తర ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.