Others

అరవై దాటాక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వయసులో ఉన్నప్పుడు వచ్చే సమస్యలకన్నా వయసు మళ్ళాక వచ్చే సమస్యలు విభిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలే కాకుండా కాలంతో వచ్చిన మార్పులవలన ఏర్పడిన సమస్యలు కూడా పెద్ద వయసువారిని వేధిస్తుంటాయి.
ఈమధ్యకాలంలో ఇంటర్‌నెట్ వచ్చిన తర్వాత దాని ద్వారా మోసాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కష్టపడి సంపాదించిన సొమ్మును ఇనె్వస్ట్ చేసే విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. మిత్రులతో, కుటుంబ సభ్యులతో, బ్యాంకర్స్‌తో సంప్రదించి, చర్చించిన తరువాతే ఎందులోనైనా ఇనె్వస్ట్ చేయాలి.
సేవింగ్స్ ఎకౌంట్స్‌లో మొత్తం కొంచెం ఎక్కువగా ఉన్నట్లయితే దానికి సాధ్యమైనంత ఎక్కువ వడ్డీ వచ్చే మార్గం ఆలోచించాలి. ఆరు నెలలకు ఒకసారి కొంత మొత్తాన్ని సర్ట్ఫికెట్ ఆఫ్ డిపాజిట్ సి.డికి మార్చినట్లయితే కొంచెం ఎక్కువ వడ్డీ వస్తుంది.
ఒంటరిగా ఉన్నప్పుడు అపరిచితులను ఎట్టి పరిస్థితులలోను ఇంటిలోనికి అనుమతించకూడదు. ఫోన్‌లో సంప్రదించాకే అనుమతించాలి.
అరవై దాటాక ఆహార నియంత్రణ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈ వయసులో తక్కువగా ఆహారం తీసుకవోడం మంచిది. పండ్లు, కూరగాయల ముక్కలు ఎక్కువగా తీసుకోవాలి.
పాత మిత్రులతో సంబంధాలు కొనసాగించడం మంచిది. మనసుకు హాయిగా ఉంటుంది. మిత్రులెవరైనా అనారోగ్యానికి లోనైతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లటం, మందులు కొనడం లాంటి వాటి విషయంలో సాయం చెయ్యడం, సాయం పొందటం మనసుకు తృప్తినిచ్చే అంశాలు.
క్రెడిట్ కార్డు వంటివి వుంటే వాటి వెనుక వైపు సంతకం చెయ్యకండి. ఒకవేళ కార్డు పోతే ఆ వెనుక వున్న సంతకం ఫోర్జరీకి గురయ్యే ప్రమాదం ఉంది.
‘సీనియర్ సిటిజన్ ఫోరం’ లాంటిది వుంటే అందులో చేరి సమూహంతో వున్న బలాన్ని మానసిక బలంగా పెంచుకునే వీలుంటుంది. వీలైనన్ని శుభకార్యాలకు వెళ్లి బంధు మిత్రులను కలుసుకుని ముచ్చటించే అవకాశాలు ఉంటాయి.
అరవై దాటాక ఆటుపోట్లు తట్టుకోవాలంటే యాభై దాటిన దగ్గరినుండే కొంత ప్రిపరేషన్ ఉండాలి. ఎందుకంటే వేగంగా మారుతున్న దేశ కాల పరిస్థితులు ఎన్నో సమస్యలను, సవాళ్లను తీసుకురావచ్చు.

- హిమజా రమణ