వరంగల్

మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, జూన్ 8: జిల్లాలో విస్తారంగా మొక్కలు నాటి అటవీ విస్తీర్ణ శాతాన్ని పెంచి పర్యావరణాన్ని కాపాడుకుందామని జనగామ కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు. హరితహారంలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో గురువారం వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారి ప్రగతి ఫార్మసీ కళాశాల సమీపంలో నుంచి నిర్మిస్తున్న కొత్త బైపాస్ రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన కలెక్టర్ శ్రీదేవసేన రావి మొక్కను నాటి నీరుపోసి అనంతరం విలేఖరులతో మాట్లాడారు. జిల్లాలో అటవీ భూములు, గుట్టలు, కొండలు అధికంగా ఉన్నాయని, వాటిలో మొక్కలు నాటితే భవిష్యతులో మంచి ప్రయోజనం ఉంటుందని అన్నారు. అందకు ప్రణాళిక ప్రకారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. వర్షాలు పడుతున్న ఈ సమయంలో మొక్కలు నాటితే అవి పెరిగి పెద్దవయ్యేందుకు మంచి అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరు హరితహారంలో భాగస్వాములై మొక్కలు నాటి వాటిని కాపాడుకోవాలని కోరారు. విత్తనబంతుల తయారీ విజయవంతంగా సాగుతుందని, వాటివల్ల కలిగే ఉపయోగాలను తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ కన్జవేటర్ నర్సయ్య, జిల్లా అటవీ శాఖ అధికారి భీమ, ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరాజు, స్వప్నలు పాల్గొన్నారు.