కడప

వ్యవసాయానికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూన్ 8:తెలుగుదేశం ప్రభు త్వం వ్యవసాయ రంగంలో గణనీయంగా అభివృద్ధిసాధిస్తూ పండ్లతోటలకు రూ.1100కోట్లు ఖర్చుచేసి అభివృద్ధి సాధిస్తూ రాష్ట్ర విభజనతో రూ.16వేలకోట్లు లోటు బడ్జెట్ ఉండ గా ఆ సమయంలో వృద్ధిరేటు 7శాతం ఉండగా, ప్రస్తుతం 12.5శాతానికి చేరుకుని జాతీయ వృద్ధిరేటు కంటే రాష్ట్ర వృద్ధిరేటు అధికంగా సాధించామని వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జిల్లా మంత్రి సి.ఆదినారాయణరెడ్డిలు పేర్కొన్నారు. నవనిర్మాణదీక్ష చివరిరోజు గురువారం మహాసంకల్పం కార్యక్రమంలో నగరంలోని మేడాకనె్వన్షన్ హాల్‌లో ఏర్పాటుచేసిన మహాసంకల్ప సభకు వారు ముఖ్యఅతిధులుగా పాల్గొని ప్రసంగంలో పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధికార్యక్రమాలు చేపడుతూ రైతులకు రూ.24వేల కోట్ల రుణాలు మాఫీ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఎన్నికల హామీ యుద్ధప్రాతిపదికపై ఆ హామీలన్నీ నేరవేర్చామని వారు స్పష్టం చేశారు. రాష్టవ్రిభజన అనంతరం రాష్ట్రంలో ఉన్న వనరులు సద్వినియోగం చేసుకుని అభివృద్ధిని వేగవంతం చేస్తున్నామని, 970కిలోమీటర్ల మేర సముద్రతీరం ఉందని అపారమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉన్నాయని స్పష్టం చేశారు. రాష్టవ్య్రాప్తంగా రైతుల శ్రేయస్సుకోసం ప్రతి నియోజకవర్గంలో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజిలు, రైతు బజార్లు, పశుగ్రాసం, దాన, గడ్డిసరఫరా చేస్తూ సంచార పశువైద్యశాలలకు శ్రీకారం చుట్టిన ఘనత టిడిపి ప్రభుత్వానిదేనని మంత్రులు నొక్కిచెప్పారు. జిల్లాలోని వందశాతం ఉద్యాన రైతులకు డ్రిప్ పరికరాలు మంజూరు చేశామని రాష్టవ్య్రాప్తంగా వ్యవసాయరంగంలో మెకనైజేషన్, యాంత్రీకరణ వైపు రైతులు వెళ్లాలని అప్పుడే డివోటి వస్తుందని వారు పేర్కొన్నారు. రాష్ట్రం లో 175 నియోజకవర్గాల ప్రజ లు , అధికారులు, అనధికారులచేత రాష్రా టన్ని 2022 నాటికి దేశంలోని మూడు అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా , 2019 నాటికి దేశంలో అత్యుత్తమ రాష్ట్రంలో ఒకటిగా , 2050 నాటికి ప్రపంచంలో అత్యుత్తమ ప్రమాణాల రాష్ట్రంగా నిలబడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంకల్పంతో రాష్టస్రర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి గురువారం కాకినాడ నుంచి లైవ్ టెలికాస్ట్ ద్వారా మహాసంకల్పం చేయడం చాలా గొప్పవిషయమని మంత్రులు కొనియాడారు. ముఖ్యంగా జిల్లా అభివృద్ధికి 7లక్షల జనాభాలో 2లక్షలు పట్టణంలోనూ, 5లక్షలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారని అన్ని జిల్లాలతోపాటు కడప జిల్లాను కూడా సమస్థాయిలో అభివృద్ధిచేస్తున్నారని జిల్లాకు రూ.2.50లక్షల పెన్షన్ మంజూరు చేస్తామని, 17వేల గృహాలను 7.50లక్షల కుటుంబాలకు తెలుపురేషన్‌కార్డులు, గృహనిర్మాణాలు, మరుగుదొడ్లు వేగవంతం చేస్తున్నట్లు వారు పేర్కొంటూ ఉపాధిహామీ నిధులతో అనుసంధానం చేస్తూ మరుగుదొడ్లనిర్మాణాలు వేగవంతం చేస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. జిల్లాకలెక్టర్ టి.బా బూరావునాయుడు మాట్లాడుతూ నవనిర్మాణదీక్ష ఏడురోజులపాటు ప్రతిరోజు ప్రభుత్వంనిర్దేశించిన అంశాలపై సం బంధిత జిల్లా అధికారులతో చర్చించి అవగాహన చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మన లక్ష్యం ప్రజలే ముందు అనే నినాదంతో కొనసాగించాలని , నాడు ఎన్‌టిఆర్ ఇచ్చిన సందేశంలో ఇచ్చిన భాగంలో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే స్పూర్తితో పేదరికం లేని, ఆర్థిక అసమానతలు లేని, ప్రశాంతం, సురక్షిత, ఆనంద దాయకమైన సమాజ నిర్మాణ దిశగా ప్రభుత్వం మహాసంకల్పంతో నవ్యాంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా హిమకుంట గ్రామపంచాయతీ జాతీయస్థాయిలో ఉత్తమపంచాయతీగా ఎన్నికైనందుకు సర్పంచ్ వరలక్ష్మి, జెడ్పిటిసి ప్రభాకర్‌రెడ్డిలకు మెమెంటోలు ఇచ్చి సత్కరించారు. డ్వాక్రా మహిళలకు రూ.3.50కోట్లు చెక్కులు పంపిణీ చేస్తూ నవనిర్మాణదీక్ష కార్యక్రమంలో చిన్నారులు నృత్యాలు చేసి అలరించినందుకు వారికి సర్ట్ఫికెట్లు పంపిణీ చేశారు. సభా ప్రాంగణంలో సమాచార పౌరసంబంధాలశాఖ, ఇతర శాఖలు ఏర్పాటుచేసిన ఛాయచిత్రాల ప్రదర్శనను మంత్రులు తిలకించి, ఐఎన్‌టిఆర్ ఏడిలను అభినందించారు. ఈకార్యక్రమంలో పౌర సరఫరాలు సంబంధాలశాఖ రాష్ట్ర చైర్మన్ ఎం.లింగారెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు, బిటెక్ రవి, జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి (వాసు), డిసిసిబి చైర్మన్ డివి అనిల్‌కుమార్‌రెడ్డి, వైవియు పాలకమండలి సభ్యులు ఎస్.గోవర్ధన్‌రెడ్డి, టిడిపి జిల్లా ప్రధానకార్యదర్శి బి.హరిప్రసాద్, ఉపాధిహామీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పీరయ్య, గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ రామకోటిరెడ్డి, టిడిపి నాయకులు దుర్గాప్రసాద్, ప్రభాకర్‌రెడ్డి, జెసి శే్వతతెవతియ, జెసి -2 శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.