Others

ఈ విజయం ప్రీతికరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిటన్‌లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యురాలిగా తొలిసారి ఓ భారతీయ సంతతి సిక్కు మహిళ విజయం సాధించి సంచలనానికి కారణమైంది. 44 ఏళ్ల ప్రీతి కొంతకాలంగా శాండ్‌విల్ కౌన్సిలర్‌గా విధులు నిర్వహిస్తోంది. బ్రిటన్ సిక్కు సమాజం మద్దతుతో ప్రతిపక్ష లేబర్ పార్టీ అభ్యర్థినిగా రంగంలోకి దిగిన ఆమె ప్రత్యర్థిపై 691 ఓట్ల మెజారిటీతో నెగ్గింది. ఆమె బ్రిటన్ సిక్కుల నెట్‌వర్క్ సంస్థ తరపున చాలాకాలంగా పనిచేస్తోంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో పుట్టిపెరిగిన ప్రీతి అదే నియోజికవర్గం నుంచి పోటీ చేసి నెగ్గింది. ఈ ఎన్నికల్లో వివిధ పార్టీల తరపున 50మందికి పైగా భారతీయ సంతతి అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో 14 మంది లేబర్ పార్టీ తరపున, 13మంది అధికార కన్సర్వేటివ్ పార్టీ తరపున పోటీ చేశారు. వారిలో లేబర్‌పార్టీ తరపున ఏడుగురు, కన్సర్వేటివ్ పార్టీ తరపున ఐదుగురు ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. తొలివిజయం సాధించిన సిక్కు మహిళగా ప్రీతి, తొలిసారిగా నెగ్గిన తలపాగా ధరించిన సిక్కు అభ్యర్థి తన్మన్‌జీత్‌సింగ్ దేశాయ్ రికార్డు సృష్టించాడు. ఈ గెలుపు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని, పుట్టిపెరిగిన చోట ప్రజల మద్దతుతో బాధ్యతలు స్వీకరించడం ఎంతో గర్వకారణమని, ప్రజల కోసం నిరంతరం పనిచేస్తానని ప్రీతి మీడియోతా మాట్లాడుతూ చెప్పింది.