సబ్ ఫీచర్

దేవుడికి చేరువగా వచ్చాననుకున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చుట్టూ మంచుకొండలు. రివ్వున వీచే చల్లటి గాలులు. కనుచూపు మేరలో మనిషి జాడ కనిపించదు. ధైర్యమే ఊపిరిగా ముందుకు సాగి ఎత్తయిన ఎవరెస్ట్‌ను ఐదుసార్లు విజయవంతంగా అధిరోహించింది. ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆమే అన్షు జామ్సెన్ప. అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఈ ధ్రువతార ఇద్దరు టీనేజ్ పిల్లలకు తల్లి. 37 సంవత్సరాల అన్షుజామ్సెన్ప 29,029 అడుగుల ఎవరెస్ట్ శిఖరాన్ని ఐదు రోజుల్లో రెండు సార్లు అధిరోహించింది. ఇప్పటి వరకు ఆమె ఎవరెస్ట్‌ను ఐదుసార్లు ఎక్కి రికార్డు నెలకొల్పారు.
నేపాల్ మహిళ చ్చురిమ్ షెర్పా ఏడురోజుల్లో రెండుసార్లు అధిరోహించి నెలకొల్పిన రికార్డును అధిగమించారు. 2011లో ఆమె పదిరోజుల్లో ఎవరెస్ట్‌ను రెండుసార్లు అధిరోహించారు. కాని ఈసారి ఆమె ఐదురోజుల్లోనే ఎవరెస్ట్‌ను అధిరోహించి తన రికార్డును తానే తిరగరాసుకున్నారు. దీంతో రెండేళ్ల క్రితం మే18న ఆమె ఒకసారే ఈ పర్వతాన్ని ఎలాంటి అవరోధాలు లేకుండా అధిరోహించారు. ఈసారి ట్రెక్కింగ్ చాలా అద్భుతంగా జరిగిందంటారామె. ఎటుచూసినా ఎత్తయిన పర్వతాలు వాటిని చూస్తు ఎవరెస్ట్‌ను అధిరోహించటం అద్భుతంగా ఉందని చెబుతున్నారు.
మరిచిపోలేని సంఘటన
ఐదుసార్లు దిగ్విజయంగా ఎవరెస్ట్‌ను అధిరోహించిన ఆమెకు 2014లో ఎదురైన అనుభవం మరిచిపోలేనిది. ఆనాడు బేస్ క్యాంప్ వద్ద జరిగిన సంఘటనలో దాదాపు 18 మంది చనిపోయారు. అదృష్టవశాత్తు ఫ్లయిట్ ఆలస్యం అవటం వల్ల బేస్ క్యాంప్‌కు చేరుకోలేకపోయినందున తాను మృత్యువాత పడలేదని ఆమె ఆనాటి సంఘటనను వివరించారు.
ఆ ట్రిప్పును క్యాన్సిల్ చేసినా .. వెనుదిరిగి వెళ్లకపోవటాన్ని గమనించిన నిర్వహకులు ఆమె ధైర్యానికి, తెగువను గుర్తించి సాహసయాత్ర కొనసాగించడానికి అనుమతి ఇచ్చారు. ఇలా ఐదుసార్లు ఎవరెస్ట్‌ను అధిరోహించిన తొలి మహిళగా చరిత్రలో నిలిచారు. ఎవరెస్ట్‌పైకి వెళ్లిన తరువాత ఎలాంటి అనుభూతి కలుగుతుందని అడిగితే.. ‘నేను భగవంతుని దగ్గరగా వచ్చాను.. ఆయన ఆశీస్సులు ఉన్నాయి’ అన్న అనుభూతి కలుగుతుందంటారు.
ఒక రాత్రంతా అడవిలో ఒంటరిగా..
చిన్నప్పటి నుంచి సాహస క్రీడలంటే మక్కువ చూపే ఆమె పారాగ్లైడింగ్‌లో ఆసక్తితో చేరారు. కానీ సరైన గైడెన్స్ లేక ఆపివేశారు. తరువాత 15 రోజుల అడ్వంచర్ కోర్సు చేశారు. ఈ కోర్సులో భాగంగా ఆమె ఓ రాత్రంతా దట్టమైన అడవిలో ఒంటరిగా గడిపారు. ఆరోజు ఎలాంటి భయం కలుగలేదు. నిజంగా ఆ సాహసం అంటే ఎంతో ప్రేమ అని చెబుతారు.
19 ఏళ్లకే పెళ్లి
అన్షుజామ్సెన్పకు 19 ఏళ్లకే పెళ్లయింది. భర్త కూడా పర్వతారోహకుడు అవ్వటంతో ఆయన ప్రోత్సాహంతో ఆమె ఇలా ఎత్తయిన ఎవరెస్ట్‌ను అధిరోహించి గర్వంగా తలెత్తుకుతిరుగుతోంది. పిల్లలు చిన్న వయసులో ఉన్నపుడు వారిని వదలి వెళ్లటం కొంచెం బాధ కలిగినా.. పెద్దయిన తరువాత వారికి తన లక్ష్యాన్ని స్పష్టంగా చెప్పారు. ‘చావు ఇంట్లో ఉన్నా వస్తుంది’ అని నచ్చజెప్పి పర్వతారోహణకు వెళతారు. ఇపుడు ఆ పిల్లలే తల్లి చేసే సాహసకృత్యాలను గర్వంగా చెప్పుకుంటారు. పర్వతారోహణలో శిక్షణ తీసుకునేందుకు కొన్ని రోజుల పాటు ఇల్లు వదలి దూరం గా ఉండాల్సి వచ్చేదని, పిల్లలు, భర్త అర్థం చేసుకు ని సహకరించటం వల్లే ఎన్నో అవరోధాలను అధిగమించి ప్రపం చ రికార్డును నెలకొల్పగలిగానని చెబుతున్నారు.