పశ్చిమగోదావరి

అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూన్ 9 : జిల్లాలో వర్షాకాలం సీజన్‌లో అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించి ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ వైద్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వైద్యాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టరు పాల్గొన్నారు. కలెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ వర్షాకాలంలో ఎక్కువగా గిరిజన ప్రాంతాలలో అంటువ్యాధులుసోకే ప్రమాదమున్నందున ప్రత్యేక చర్యలు ఏజెన్సీ ప్రాంతంలో చేపట్టాలన్నారు. రోబేలా వ్యాక్సిన్ ప్రతీ సంవత్సరం ఆగస్టు మాసంలో 9 నెలల నుండి 19 సంవత్సరముల వయస్సు కలిగిన పిల్లలకు అందించవలసి వుంటుందని, దీనికి కావాల్సిన ఏర్పాట్లు ముందుగానే సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో నరసాపురం, బుట్టాయిగూడెం, భీమవరంలలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాటుచేయాలన్నారు. ఎపిహెచ్‌ఎంఐడిసి మెటర్నిటీ చైల్డ్ హెల్త్ బ్లాకుల భవనాలను తణుకులో సంబంధిత వైద్యాధికారి మార్చి నెలఖరుకు పూర్తి అవుతుందని చెప్పగా ఈ విషయంలో డిసెంబరు 2017 నాటికి భవన నిర్మాణాలు పూర్తిచేయాలని ఎపిఎంఐడిసి ఇఇని ఆదేశించారు. పిప్పర, అత్తిలిలో పిహెచ్‌సిల భవనాలునిర్మాణ దశలో ఉన్నాయని జనవరి నాటికి భవన నిర్మాణ పనులు వేగవం చేయాలని ఆదేశించారు. జిల్లాలో టిబి కేసులు తగ్గించేందుకు వైద్య శాఖాధికారులు కృషి చేయాలని టిబికి సంబంధించిన మందులు సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. లెప్రసీ వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవాలని అనుమానం ఉన్న ప్రాంతాలలో ప్రజలకు లెప్రసీ పరీక్షలు నిర్వహించి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. జిల్లాలో 75 మంది వైద్యాధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించి గ్రామాలలో పరిశుభ్రత పాటించి నీటి నిల్వలు లేకుండా దోమలు దరిచేరకుండా చర్యలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాల్సి వుండగా కేవలం 24 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని మిగిలిన వారు విధులు నిర్వహించకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ వైద్యాధికారి సెల్‌ఫోన్‌లో వారికి కేటాయించిన ప్రాంతాలలో ఫొటోలు తీసి ప్రత్యేక యాప్ పొందుపర్చాలని చెప్పారు. సమావేశంలో డిఎంహెచ్ ఓ డాక్టర్ కె కోటేశ్వరి, డిసిహెచ్ ఎస్ డాక్టర్ శంకరరావు, అడిషనల్ డి ఎంహెచ్ ఓ డాక్టర్ రత్నకుమారి, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రాథోడ్, ఎపి ఎం ఐడిసి ఇ ఇ కేశవరావు తదితరులు పాల్గొన్నారు.