మెయిన్ ఫీచర్

అక్షర తపస్వి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్లలోని కామారెడ్డి ప్రధాన రహదారి పక్కన సాయినగర్‌లో నివాసముండే భూర రాజేశ్వరి స్ఫూర్తికి మారుపేరు అని చెప్పవచ్చు. నేత కుటుంబానికి చెందిన భూర సాంబయ్య, అనసూర్య దంపతులకు ఆరుగరు సంతానంలో అయిదవ బిడ్డగా జన్మించిన రాజేశ్వరి.. పోలియో వ్యాధితో శరీరంలోని అంగాలు సరిగా పని చేయక పోతే.. ఆ తల్లి తండ్రులు, నానమ్మ, అమ్మమ్మలు రాజేశ్వరిని నడిపించడానికి అవసరమైన అన్ని లేపనాలు రాశారు. మందులూ ఇప్పించారు. పేదిరికంలో ఉన్నా, ఆ బిడ్డ కోసం అన్ని విధాలుగా ప్రయత్నించారు. మొత్తానికి నిలబడి కాస్త తడబడే ఆడుగులతో నడిచేలా రాజేశ్వరిని తీర్చి దిద్దారు. తోటివారు బడికి వెళ్తుంటే..తానూ వారి వెంట బడికెళ్ళింది. చేతిలో రాయరాని పరిస్థితిలో..కాలికి పని చెప్పి, బలపంను కాలి వేళ్ళమద్య నిలిపి ‘అ ఆ’లు దిద్దింది. పట్టుదలగా.. ప్రయత్నించి అక్షరాలను స్వంతం చేసుకుంది. యుపిఎస్ నెహ్రూనగర్ పాఠశాలలో ఏడవ తరగతి వరకు మాత్రమే ఉండగా, అక్కడి వరకు చదువుకుంది. బాలికల హైస్కూల్ దూరంగా ఉండడం, తోడు ఎవరు లేకపోవడంతో హైస్కూల్ చదువు చదవాలని బలమైన కోరిక ఉన్నా చదవలేక పోయింది. వయసు ఎదిగిన కొద్దీ రాజేశ్వరిలోని భావాలు సైతం మనసులో దాగకుండా అక్షరాలుగా కాగితంపై అద్దేట్టు చేయగా అవే కవితలయ్యాయి. ఎప్పుడూ ఒంటరిగా కూర్చుండి నిరంతరం ఆలోచించే రాజేశ్వరి.. తను ఉన్న పరిసరాలలోనే నేతన్నలు ‘ఉపాధి’ కరువుతో ఉరి వేసుకుని బలవన్మరణాల బాట పడితే తనను చూడండి అంటూ కవితల ద్వారా భరోసా సందేశాన్ని ఇచ్చింది.
ఈమె రాసిన కవితల్లో మొదట్లో అంతా అమ్మ గురించే రాసింది. ఆ తర్వాత స్థానిక డా.పూర్ణచందర్ జీవిత చరిత్ర గురించి, మాజీ సిఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవిత చరిత్ర, ప్రముఖ ఆర్టిస్టు వడ్డెపల్లి సత్యం గురించి జీవిత చరిత్రలోని ముఖ్య ఘట్టాలను తన కాలితో గ్రంధస్థం చేసింది. భూర రాజేశ్వరి గురించి అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సన్మానించాలని మాజీ సిఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుని రాజేశ్వరి సోదరుడికి టిడిపి నేత పుట్ట కిషోర్ ద్వారా సమాచారం పంపగా 2014లో రాజేశ్వరిని సన్మానించి ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.2 లక్షలు ఆమె పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. ఆ సందర్భంగా పలు ఛానళ్ళలో రాజేశ్వరి కథనాలు ప్రసారం కాగా తాను ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజను కలువాలని ఉందని వెల్లడించింది. సమాచారం అందుకున్న సుద్దాల అశోక్ తేజ తన సతీమణితో కలిసి సిరిసిల్ల సాయినగర్‌లోని రాజేశ్వరి ఇంటికి వచ్చారు. ఆమె శారీరక వైకల్యం, అయినా ఆమెలో రాయాలన్న సంకల్పం, ఏదో చేయాలన్న తపన చూసి ముచ్చట పడ్డారు. ఆమె ధైన్య స్థితి చూసి కంట నీరు పెట్టారు. అయినా..ఆమె మనో ధైర్యానికి, ఆత్మ స్థైర్యానికి సలాం చేస్తూ.. రాజేశ్వరీ..నిన్ను సిరిసిల్ల రాజేశ్వరిగా ప్రపంచానికి పరిచయం చేస్తా.. నీవు రాసిన కవితలన్నీ ఒక పుస్తకంగా ప్రింట్ వేయించి, జ్ఞానపీఠ సినారె చేతుల మీదుగా రవీంద్ర భారతిలో ఆవిష్కరణ చేయిస్తానని మాట ఇచ్చారు. అక్షరాలా 2015, జనవరి 6న సుద్దాల హన్మంతు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అశోక్ తేజ కార్యక్రమం నిర్వహించి, దీని సాకారం చేశారు. రవీంధ్ర భారతిలో సినారెచే సిరిసిల్ల రాజేశ్వరిగా నామకరణ చేసి, కవితాసంపుటిని ఆవిష్కరింపచేశారు. అదే వేదికపై రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాహదారు కెవి.రమణాచారి ప్రభుత్వం పక్షాన రూ.10 లక్షలను రాజేశ్వరి పేరిట డిపాజిట్లు చేస్తున్నట్టు సిఎం పక్షాన ప్రకటన చేసి ఆమేరకు బ్యాంకులో డిపాజిట్ చేశారు. దీనిపై ప్రస్తుతం ప్రతి నెలా రూ.6800లు వడ్డీ రూపంలో జీవనభృతి రాజేశ్వరికి అందుతుండగా, ఇందులో ఐటి కింద రూ.700లు పోను మిగితా మొత్తం రాజేశ్వరికి అందుతోంది. ఇలా సుద్దాల అశోక్ తేజ ద్వారా సిరిసిల్ల రాజేశ్వరిగా రాష్ట్ర, దేశ ప్రజలకు పరిచయమైన రాజేశ్వరి ఎస్సెస్సీ ఓపెన్ పరీక్షలో ఉత్తీర్ణురాలు కాగా.. ఉన్నత చదువులు చదవాలన్న ఆకాంక్షనూ ఆమె వ్యక్తం చేసింది.

- టి.విశ్వనాథం, సిరిసిల్ల