దక్షిన తెలంగాణ

మాతృభాషా శతకం (పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వృత్తిరీత్యా మండల ప్రజాపరిషత్ సిరిసిల్లలోని పంచాయతీరాజ్ శాఖలో పర్యవేక్షకులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మాడుగుల మురళీధర్ శర్మ గారు రచనా వ్యాసంగాన్ని ప్రవృత్తిగా మలుచుకుని..‘మాతృ భాషా శతకము’ పేరుతో ఓ పద్యకావ్యాన్ని ప్రకటించారు. శర్మగారికి గేయాలు, పాటలు, వచన కవితలు, నానీలు, హైకూలు, భక్తి పాటలు రాయడంలో అనుభవం ఉంది. ఛందోబద్ధ పద్యాలను రాయడంలోనూ తమ సత్తా నిరూపించుకోవడానికి..‘మాతృ భాష తెలుగు మరవకుండు’ మకుటంతో మాతృభాషా శతకాన్ని వెలువరించాడు. ఈ గ్రంథంలోని పద్యాలు శర్మగారికి మాతృభాష తెలుగు పట్ల ఉన్న మక్కువను సూచించేలా ఉన్నాయి! అలతి అలతి పదాలతో అందమైన భావాలను ప్రకటించాయి. సమాజంలో మానవీయ విలువలను పెంచడానికి, అంతకుమించి. మన సంస్కృతిని కాపాడడానికి ఇందలి పద్యాలు కొంతవరకైనా దోహదపడతాయి!
పాశ్చాత్య సంస్కృతి పడగనీడలో.. మమీ, డాడీలుగా పిలువబడుతున్న అన్న నాన్నలకు కనువిప్పు కలిగేలా..
‘అమ్మ! నాన్న!యన్న నాప్యాయతల నింపు
మమీ, డాడీ పిలుపు మనది కాదు
విత్త వ్ఢ్యౌ మందు కొత్త పిలుపు వలదు
మాతృభాష తెలుగు మరువకుండు’ అంటూ ఓ పద్యంలో శర్మగారు హితవు పలికారు.
‘అమ్మ పలుకులోని యమృత ధారతో..తెలుగు భాష వెలిగి దీప్తినొందు’ అంటూ మరో పద్యంలో సూచించారు.
‘్భషలోన పట్టువాసిగాననున్నట్టి..బోధకుల పెట్టి బోధజేయ..పిల్లలంత తెలుగు ప్రీతితో నేర్తురు’ అంటూ గుర్తు చేశారు.
మాతృభాషనే అన్ని భాషల నేర్వడానికి మూలమని తెలుపుతూ.. ‘నాణ్యమైన తెలుగునభ్యసించిన చాలు..వివిధ భాషలన్ని వేగవచ్చు మాతృ భాషకన్న మించి భాషే లేదు’ అని విడమరిచి చెప్పారు. ఇలా..ఇందులోని ప్రతి పద్యంలో మాతృభాష తెలుగు యొక్క ఆవశ్యకతను నొక్కి వక్కాణించారు. కలములోన నిండుగా నుండు ‘సిర’లాగ భాషలోన నుండు పలుకులన్ని..కలమునుండి జారు ఘనమైన సిరపల్కు అంటూ ఓ పద్యంలో శర్మగారు కవితాత్మకంగా తమ భావాలను ప్రకటించారు. తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని తెలియజెప్పారు. తెలుగు భాష పట్ల ఆసక్తిని పెంపొందించడానికి ‘మాతృ భాషా శతకము’ను వెలువరించిన మాడుగుల మురళీధరా శర్మగారికి అభినందనలు తెలుపుదాం. మున్ముందు మరిన్ని సామాజికాంశాలతో శర్మగారి కలం నుండి మంచి రచనలు జాలువారాలని కోరుకుందాం.

పేజీలు: 48 - వెల: 50/-
ప్రతులకు:
మాడుగుల మురళీధర శర్మ
ఇం.నెం.18-14-181/1
మారుతీనగర్-2, సిద్ధిపేట జిల్లా
సెల్.నం.9951985880

- సాన్వి, కరీంనగర్
సెల్.నం.9440525544