ఉత్తర తెలంగాణ

నా మానసిక సంఘర్షణే నన్ను కవయత్రిని చేసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాను అనుభవించిన మానసిక సంఘర్షణే.. తనను కవయిత్రిగా మార్చిందని సవినయంగా ప్రకటించుకునే ప్రముఖ కవయిత్రి పొద్దుటూరి మాధవీలత వృత్తిరీత్యా డ్రెస్ డిజైనర్.. రచనా వ్యాసంగాన్ని ప్రవృత్తిగా మలచుకొని అనతి కాలంలోనే సాహితీ రంగంలో కవయిత్రిగా అందరి మన్ననలు చూరగొన్నారు. 2014లో ‘మనస్సునామి’ కవితా సంపుటిని వెలువరించి.. అంచెలంచెలుగా ఎదిగిన ఆమె ‘తంగేడుపూల వనంలో’, ‘్భక్తిలతా మాధవీయం’, ‘గాయాలెన్నయినా’, ‘ప్రేమాంకురమై’ గ్రంథాలకు జీవం పోశారు. విభిన్నమైన కవితా వస్తువులను ఎంపిక చేసుకుని. ఆర్ద్రమైన కవిత్వాన్ని పండించారు. భావ కవిత్వాన్ని రచించారు. భక్తి ప్రబోధ గ్రంథాన్ని ప్రకటించారు. ‘ప్రేమాంకురమై’ పేరుతో ఓ దీర్ఘ కవితను గ్రంథస్తం చేశారు. వివిధ ప్రముఖ పత్రికల్లో ఆమె రాసిన కవితలు, కథలు, వ్యాసాలు ప్రచురింపబడినాయి! 2015లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ప్రత్యేక పురస్కారాన్ని అందుకున్నారు. వివిధ విశ్వవిద్యాలయాల ద్వారా అనేక సాహితీ సంస్థల ద్వారా, తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమం పిదప ఆమె సన్మాన సత్కారాలను పొందడమే గాక..అనేక సంస్థల ద్వారా సాహితీ పురస్కారాలను స్వీకరించారు. వివిధ టివి ఛానళ్లలో అనేక సందర్భాల్లో వివిధ అంశాలపై ప్రసంగించిన అనుభవం ఆమెకుంది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి గ్రామానికి చెందిన పొద్దుటూరి మాధవీలత రెండు తెలుగు రాష్ట్రాల్లో సాహితీ మిత్రులను కలిగి వుండటం విశేషం! చాలా ఆలస్యంగా అనగా తమ 48వ ఏట (2013)లో సాహితీ రంగంలోకి ప్రవేశించి నిరంతర సాహితీ సృజన చేస్తూ.. గాఢమైన కవిత్వాన్ని పండిస్తూ అందరి ప్రశంసలందుకుంటున్న ఆమెతో ‘మెరుపు’ ముచ్చటించింది. ముఖాముఖి వివరాలు ఆమె మాటల్లోనే పాఠకులకు అందిస్తున్నాం..

ఆ రచనా వ్యాసంగం ప్రారంభించారు?
నా 48వ ఏట. 2013లో ప్రారంభించాను.

ఆమీరు రచనల పట్ల ఆసక్తి చూపడానికి ప్రేరణ?
తెలంగాణ ఉద్యమం, నేను చూసిన సమాజం, అనుభవించిన సంఘర్షణ నన్ను కవయిత్రిగా మార్చింది.

ఆ మీ దృష్టిలో కవిత్వం అంటే ఏమిటి?
కవిత్వమంటే వేడుక కాదు, గాయాల గొంతుక అన్నారు ప్రముఖ కవి డాక్టర్ నందిని సిధారెడ్డి గారు. అంతకన్నా కవిత్వానికి నిర్వచనం చెప్పగలమా? వస్తువు ఏదైనా కవిత చదివాక మనసు తడిసి ముద్దవ్వాలి. అదే నా దృష్టిలో అసలైన కవిత్వం.

ఆ మంచి కవిత్వానికి ఉండవలసిన లక్షణాలు
ఏమిటి?
కవిత్వంలో వాడే పదాల లోతులు, భావాల సాంద్రత, ప్రతీకల నిగూఢత, సున్నితమైన వ్యంగ్యం, వ్యక్తీకరణలో కొత్తదనం- కవిత్వంలో ముఖ్యభూమికను పోషిస్తాయి! అక్షరాల్లో శరాలను సంధించినట్లుండాలి! చూపుతోనే మనసును స్పర్శించినట్లుండాలి! తొలకరి చినుకు స్పర్శించిన అనుభూతిని పొందాలి.

ఆ సాహిత్య పరంగా మీ కుటుంబ నేపథ్యం
ఏమిటి?
నిజానికి నేను సాహిత్యం అడుగిడడమే ఒక విచిత్రం! మా కుటుంబంలో అటు ఇటూ ఎవరికీ సాహిత్యంతో అనుబంధం లేదు! కవిత్వం నాకు భగవంతుడిచ్చిన వరం! అక్షరమే ఆసరాగా ఈ రోజు విశ్వవిద్యాలయం మెట్లు ఎక్కే భాగ్యం నాకు ప్రసాదించింది!

ఆ మీ ‘మనస్సునామి’ గురించి చెబుతారా?
‘మనస్సునామి’ ఒక సార్థక నామధేయ గ్రంథం! ఆవిష్కరించిన మరుక్షణమే జడివానను కురిపించే ప్రకృతికి, కవిత్వానికి గల అనుబంధాన్ని రుజువు చేసింది! ఎన్నో ఏళ్లుగా నాలో పేరుకుపోయిన భావాల వెల్లువను తన మదిలో నిక్షిప్తం చేసుకున్న ఆ గ్రంథానికి ఆ పేరుని సూచించి, మనస్సునామి సృష్టికర్తగా నాకు శాశ్వత గుర్తింపునిచ్చిన శ్రీ వి.పి.చందన్ రావుగారికి, ఆ గ్రంథాన్ని తన అమృత హస్తాల మీదుగా ఆవిష్కరించి నా సాహితీ ప్రస్థానానికి పూలబాట పరిచిన శ్రీ దాస్యం సేనాధిపతి గారికి ధన్యవాదాలు.

ఆ మీకు నచ్చిన కవులు, రచయితలు ఎవరు?
శ్రీశ్రీ, డాక్టర్ నందిని సిధారెడ్డి, సిహెచ్.మధు, డాక్టర్ నాళేశ్వరం శంకరం, దాస్యం సేనాధిపతి, దేశపతి శ్రీనివాస్.
ఆ తెలంగాణ ఉద్యమ సమయంలో
మీరు నిర్వహించిన పాత్ర?
ఒకసారి టి.న్యూస్‌లో తెలంగాణ సాధించే దిశగా జరిగిన చర్చాకార్యక్రమంలో పాల్గొన్నాను. ఆ కార్యక్రమాన్ని చూసిన బోధన్ జెఎసి కన్వీనర్ గోపాల్ రెడ్డి నన్ను కలిసారు. ఇద్దరం చాలాసార్లు తెలంగాణ విషయమై చర్చించేవాళ్లం! అప్పటి నుండి తరచుగా దీక్షాశిబిరాన్ని సందర్శించడం ద్వారా నా వాణిని వినిపించాను. ఆ సమయంలోనే ఉద్యమ నేతలు, సాహితీవేత్తలతో పరిచయం ఏర్పడింది.

ఆ కొత్త రచయితలకు, కవులకు శిక్షణ
అవసరమని భావిస్తున్నారా?
కవిత్వం సహజసిద్ధంగా కొంత అధ్యయనం ద్వారా కొంత సిద్ధించవచ్చు. రచయితలకు అవగాహన వల్ల కొంత సృజనాత్మకత వల్ల కొంత అలవడుతుంది. ప్రక్రియ ఏదైనా ముందుగా మనల్ని మనం సంస్కరించుకుని, తర్వాత సమాజానికి మార్గనిర్దేశనం చెయ్యడం ఉత్తమం!

ఆ ఇప్పుడొస్తున్న కవిత్వంపై మీ అభిప్రాయం?
కొందరు చాలా బాగా వ్రాస్తున్నారు. మరికొందరు వ్రాసేది కవిత్వం అనడం కన్నా వ్యాసాలు అంటే బాగుంటుంది. వచన కవిత్వానికి నిర్దిష్టమైన ప్రమాణాలు అంటూ ఏవీ లేకపోవడం వల్ల తాము వ్రాసిందే కవిత్వం అనుకుంటే అది ఎక్కువకాలం నిలబడదు. కవిత్వీకరించడం ఒక కళ. పువ్వు విచ్చుకున్నంత సహజంగా, గుండెల్లోంచి వెల్లువెత్తేదే.. అసలైన కవిత్వం!

ఆ మారుతున్న సమాజంలో ఇంకా స్ర్తివాద
కవిత్వం అవసరమంటారా?
అవసరమే! గృహహింస, లైంగిక వేధింపులు, నిర్బలులైన మహిళలపై అనునిత్యం జరుగుతున్న అత్యాచారాలు, ఇంకా కొనసాగుతున్న వివక్ష ఈ సమాజంలో స్ర్తివాద కవిత్వం అవసరమే!

ఆ కొత్త కవులు, రచయితలకు మీరిచ్చే
సూచనలు, సలహాలు?
సూచనలు, సలహాలు ఇచ్చేటంత పెద్దదాన్ని కాదేమో? కవిత్వమైనా, కథ అయినా వస్తువుపై అవగాహన తప్పనిసరి! కథ చెప్పాల్సిన విషయంలో ఎంత సూటిదనం అవసరమో, కవిత్వీకరించేటప్పుడు నర్మగర్భంగా పోల్చడం తప్పనిసరి. సామాజిక సమస్యలను ఎత్తిచూపడంలో సృజనాత్మకతను జోడించి ఊహాశక్తిని మేళవిస్తే.. అద్భుతమైన రచనలు వస్తాయి. ముఖ్యంగా అధ్యయనం చాలా అవసరం!

ఇంటర్వ్యూ: దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544