విశాఖపట్నం

పేద గుండె ప్రమిదలు (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేద గుండె ప్రమిదలు (మనోగీతికలు)

పేద ప్రజల కడుపు కొట్టి
ప్రభుత్వాల కన్నుగప్పి
హిమాలయపు నేరాలను
ఎవరెస్టుల పాపాలను
ఎనె్నన్నో చేసిచేసి
ధనరాశులు కూడబెట్టి
బ్యాంకుల్లో దాచిపెట్టి
భూముల్లో పాతిపెట్టి
దేశ ప్రగతి మట్టి గలిపి
సాధించే దేమిటయా
అక్రమార్కులారా
నల్లగుండె కుబేరులారా
ఎంత దోచినా
రతనాలను తినరు కదా
ఎన్ని భోగాలలో మునిగి తేలినా
దహన సంస్కారానికి
గంధపు చెక్కలైనా
తుమ్మ చెక్కలైనా
మిగిలేది బూడిదే కదా
నిలువు ఆరు అడ్డు మూడు
నేల మనకు చాలు కదా
పాడు ఆశలను వదిలి ప్రగతికి తోడ్పడ రాదా
నల్ల కుబేరులారా తెల్ల కుబేరుల్లా మారి
పేద గుండె ప్రమిదలలో
వెలుగులు నింపగలరా!

- విద్వాన్ ఆండ్ర కవి మూర్తి, అనకాపల్లి.
సెల్ : 9246666585.

జాగ్రత్త... జాగ్రత్త

భూమితల్లి మనల్ని పాలించడానికి
పగలు రాత్రుల ప్రయోజనాలను,
పాఠాలను, అనుభవాలను
అందించడానికి తిరుగుతునే ఉంది యుగయుగాలుగా
అన్నింటికీ ఆధారం తనే అయినా
తన్నుతాను తగ్గించుకుని
మూడు వాటాలు సముద్రుడికే ఇచ్చేసింది
ఎంతైనా సహనమూర్తి కదా
ఎంతైనా ఇవ్వడమే తెలుసా మహాతల్లికి...
తను ఇవ్వనిదేదీ మనకి?
మనవాళ్లు అది చేశాం... ఇది చేశాం... అంటూ
గోతులు, రాళ్లు, స్తంభాలు, అవి ఇవి ఎన్ని తవ్వినా
అనుభవించినోడికి అనుభవించినంత... పూర్వజన్మ ఫలమో!... ఆ తర్వాతి జన్మకు
తీర్చుకోవలసిన పరిహారమో!
తాను తిరుగుతునే ఉంది... తిరుగుతునే ఉంది...
మనం తిని తిరుగాడాలి కదా!
ఎంత పెట్టినా ఏం చేసినా తానేమీ ఆశించదు కదా!
మన పురోభివృద్ధి తప్ప!
తన ప్రతి ఖండానికీ స్వభావాన్ని మార్చుకుంటూ... పంటల్లో, పక్షుల్లో... జంతువుల్లో వైవిధ్యాన్ని
సమతుల్యాన్ని సాగింపజేస్తోంది...
జీవ వైవిధ్యానికి విపరీతార్థం తీసుకున్న పుత్ర రత్నాలు జాతి భిన్నత్వం, దేశ శత్రుత్వం, కలహ కుతూహల
తత్వాలతో భూమాత ఊరి బంధిస్తున్నారు!
తన నుంచే ఉద్భవించిన ప్రాణ వాయువుని దాని దయతో బతుకుతున్న నరుడు భూమాత నుంచి
వేరు చేయడమా?!...
పచ్చని లోగిళ్లలో పుట్టి పెరిగిన
ప్రాణవాయు గొంతు నులిమితే
పచ్చదనం పొగచూరి...
విషవాయు వలయమై
జాతినే కబళించేయదూ...!.

- చావలి శేషాద్రి సోమయాజులు,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
పాచిపెంట, విజయనగరం జిల్లా

అనివార్యం

ప్రాణాలు తీస్తుంది కాబట్టి
కరెంటు వద్దనను
కొందరు గల్లంతవుతారని
రోడ్ల వెడల్పు చెయ్యొద్దనను
అభివృద్ధికి అడ్డం పడినప్పుడు
భవంతైనా, గుడిసైనా, గుడైనా
తొలగించాల్సిందే
ఎందుకంటే మా ఊరికి అభివృద్ధి అవసరం

- మాధవీ సనారా. సెల్ : 9440103134.

మృత్యువు ఆగదు

కాలం ఎంతో విలువైనది
రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు
లక్షాధికారి అయినా, భిక్షాధికారి అయినా
శ్మశానంలో ఇద్దరూ సమానమే
లక్షలు, కోట్లు ఉన్నాయని మురిసిపోవద్దు
అవి నీ వెంట రావు ఒక్క మృత్యుతు తప్ప
అందుకే బతికున్నప్పుడు
నలుగురికి సాయం చెయ్యి
చేసిన ఉపకారమే
చిరంజీవిగా గుర్తింపునిస్తుంది

- వేగి నూకరాజు, గవరవీధి,
బుచ్చిరాజుపాలెం,
విశాఖపట్నం. సెల్ : 7702141014.

మాట మహత్యం

భావ గ్రహణం ప్రకటనాధారం భాష
భాషకు ప్రాణం మాటల హారం
మనిషిదో రకమైన మాట తీరు
మాటల పేర్పు పలు రకాలు
స్వాంతన పొందేది మాటతోనే
విలవిలలాడేది మాటతోనే
మనుషుల్ని దగ్గర చేసేది మాటే
బంధాల్ని విడదీసేది మాటే

- గంటి కృష్ణకుమారి,
సెల్ : 9441567395.