మెదక్

ఏడుపాయల క్షేత్ర పాలకవర్గ చైర్మన్‌గా విష్ణువర్ధన్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపన్నపేట, జూన్ 12: ఏడుపాయల శ్రీ వనదుర్గ్భావాని ఆలయ పాలకమండలి నూతన చైర్మన్‌గా పి.విష్ణువర్దన్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో ప్రభుత్వం నియమించబడిన 14 మంది డైరెక్టర్లతో ఆలయ ఇఒ టి.వెంకటకిషన్‌రావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, తెలంగాణ శాసనసభ ఉపసభాపతి యం.పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ భారతి హొళ్లికేరిలు హాజరయ్యారు. ప్రభుత్వం నియమించిన డైరెక్టర్లు పి.విష్ణువర్దన్‌రెడ్డి, బి.నారాయణ, ఎస్.దుర్గయ్య, ఎం.నాగప్ప, టి.జ్యోతి అంజిరెడ్డి, యం.కిష్టయ్య, కె.ప్రభుగౌడ్, దాసరి శ్రీ్ధర్, జిన్న చంద్రయ్య, పొలబోయిన కిషన్, టి.సంగప్ప, ఎన్.శ్రీనివాస్‌రెడ్డి, గౌరిశంకర్, యం.నాగయ్యలను డైరెక్టర్లుగా ఆలయ ఈఓ వెంకటకిషన్‌రావు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆలయ పాలకమండలికి చైర్మన్ ఎన్నికను ఈఓ నిర్వహించారు. ఆలయ పాలక మండలి చైర్మన్‌కు పి.విష్ణువర్దన్‌రెడ్డి పేరును డైరెక్టర్ దాసరి శ్రీ్ధర్ ప్రతిపాధించగా మరో డైరెక్టర్ ప్రభుగౌడ్ బలపరిచాడు. చైర్మన్‌కు ఒకే పేరు రావడంతో విష్ణువర్దన్‌రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఏడుపాయల ఆలయ పాలకమండలి నూతన చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన పి.విష్ణువర్దన్‌రెడ్డిని ఇఒ ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకు ముందు వనదుర్గామాత ఆలయంలో నూతనంగా ఎన్నికైక చైర్మన్ విష్ణువర్దన్‌రెడ్డి, డైరెక్టర్లు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెరాస రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, మెదక్ మున్సిపల్ చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, మెదక్ మార్కెట్ కమిటి చైర్మన్ కృష్ణారెడ్డి, మెదక్ ఆర్డీఓ మెంచు నగేష్, ఎంపిపి అధ్యక్షురాలు పవిత్ర దుర్గయ్య, జడ్పీటిసి స్వప్న బాలాగౌడ్, మండల తెరాస అధ్యక్షుడు ప్రశాంత్‌రెడ్డి, మండలంలోని సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.