రంగారెడ్డి

రూ. 1.9 కోట్ల నకిలీ విత్తనాలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంషాబాద్, జూన్ 12: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో నకిలీ విత్తనాలు కలకలం రేపుతున్నాయి. మండల పరిధిలోని పలు గ్రామాల్లో గత వారం రోజులుగా నకిలీ విత్తనాల విక్రయాలు జోరందుకున్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌ఓటి) పోలీసులు ఆదివారం రాత్రి శంషాబాద్‌లో తనిఖీలు నిర్వహించారు. ఓ షాపులో భారీ ఎత్తున నకిలీ విత్తనాలు పట్టుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 1.9కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని నకిలీ విత్తనాలు సీజ్ చేశారు. శంషాబాద్ సమీపంలోని రాళ్లగూడలో కొందరు వ్యక్తులు ఒక గోడౌన్ ఏర్పాటు చేసి నకిలీ విత్తనాలు తయారు చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు ఆ గోడౌన్‌పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రవికుమార్, శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యాపారులు అక్రమంగా కాటన్ సీడ్స్ ప్యాకింగ్ చేస్తుండగా విషయం బయటపడింది. కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం ఎస్‌వోటి పోలీసులు శంషాబాద్ పోలీసులకు నిందితులను అప్పగించినట్టు ఎస్‌వోటి పోలీసులు తెలిపారు.