ఆంధ్రప్రదేశ్‌

శిరీషది ఆత్మహత్య కాదు హత్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆచంట, జూన్ 16: హైదరాబాద్‌లో అనుమానాస్పదస్థితిలో మరణించిన బ్యూటీషియన్ శిరీష అలియాస్ విజయలక్ష్మిది హత్యకాదు, ఆత్మహత్యేనని హైదరాబాద్ పోలీసులు ప్రకటించడాన్ని శిరీష తల్లి రామలక్ష్మి ఆరోపించారు. కావాలనే పోలీసులు ఈ కేసును నీరుగార్చారని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని ఆమె ప్రకటించారు. శిరీష స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరు ఎంపిపాలెంలో ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఆత్మహత్యవల్లే శిరీష చనిపోయిందని పోలీసులు వెల్లడించడం దురదృష్టకరమన్నారు. శిరీష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, కావాలనే పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఇప్పటికైనా పోలీసులు పూర్తిస్ధాయిలో దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని, లేదంటే న్యాయపోరాటానికి సిద్ధమని రామలక్ష్మి తెలిపారు.