ఫోకస్

వసూళ్ల కట్టడికి చట్టం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో అక్రమంగా ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్న ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం మెమోలు, జీవోలు జారీచేసి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఇటీవల జారీ అయిన జీవో నెం.1లో పాఠశాల నిర్వహణ ఖర్చులు, విద్యార్థుల సంఖ్యను బట్టి ఎవరిష్టానుసారం వారు ఫీజులు వసూలు చేసుకోవచ్చని చెప్పటం శోచనీయం. కచ్చితంగా ఓ చట్టాన్ని తీసుకురావటమే కాకుండా ఆ చట్టాన్ని అమలు చేసేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా నియమించాల్సి ఉంది. అసలు జీవోల ప్రకారం కూడా ఆయా పాఠశాలల్లో వసూలు చేసే ఫీజుల వివరాలు అందరికీ తెలిసేలా బోర్డులపై స్పష్టంగా పేర్కొనాల్సి ఉంది. అలాగే ఉపాధ్యాయుల విద్యార్హతలను కూడా తెలియచేయాల్సి ఉంది. అయితే ఏ ఒక్క పాఠశాలలోనూ ఇలాంటి బోర్డులు మచ్చుకైనా కన్పించవు. ఒక సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా 63లక్షల మంది పాఠశాల విద్యార్థులుంటే వీరిలో 50 శాతం మంది పైగా ప్రైవేట్ విద్యా సంస్థల్లోనే చదువుతున్నారు. దేశంలో ఒక్క కేరళలోనే ఫీజులను నియంత్రించే వ్యవస్థ ఉంది. రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలు వ్యాపార సంస్థలుగా మారాయి. నియమ నిబంధనలకు విరుద్ధంగా కనీసం ట్రేడ్ లైసెన్స్ కూడా లేకుండానే ఇతర కంపెనీలు ఉత్పత్తి చేసే యూనిఫాం, దుస్తులు, బెల్ట్, టై, బూట్లు, నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఇతర పుస్తకాలను విక్రయిస్తున్నా ఈ ప్రభుత్వం చోద్యం చూస్తున్నది. సామాన్య, మధ్యతరగతి ప్రజల గోడు పట్టించుకునే వారు కన్పించడం లేదు.
- కెఎస్ లక్ష్మణరావు
శాసనమండలి మాజీ సభ్యుడు