ఫోకస్

చట్టాల అమల్లో వైఫల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌లో కార్పొరేట్ పాఠశాలలు వేలకు వేలు ఫీజులు దండుకుంటున్నా వాటికి ప్రభుత్వం అడ్డుకట్ట వేయలేకపోతోంది. ప్రైవేటు పాఠశాలల్లో పాటించాల్సిన నియమ, నిబంధనలపై ప్రభుత్వం అనేక చట్టాలు చేసినా అవి అమలుకు నోచుకోవడం లేదు. ఇష్టారాజ్యంగా ప్రైవేటు పాఠశాలలు ఫీజులు వసూలు చేస్తున్నాయి. మరికొన్ని ఇంటర్నేషనల్ స్కూళ్ల పేరిట లక్షల్లో ఫీజులు దండుకుంటున్నాయి. దీనికి అడ్డుకట్ట వేయాలంటే చట్టాలను పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. లేనిచో వరకట్నం నిషేధ చట్టం, అవినీతి వ్యతిరేక చట్టం మాదిరిగా కాగితాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది. పాఠశాలలకు అనేక నిబంధనలున్నాయి. కార్పొరేట్ పాఠశాలలు వచ్చేసరికి ఆ నిబంధనలను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఫీజుల పేరిట లక్షలకు లక్షలు దండుకుంటున్నారు. ఇంటర్నేషనల్ స్కూల్ బోర్డు పెట్టుకొని జనాన్ని తెలివిగా జనాన్ని ఆకర్షిస్తున్నారు. ప్రభుత్వమే పరీక్ష పేపర్లను సరఫరా చేస్తున్నా సీరియస్‌గా పరీక్షలు నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. లైబ్రరీ, లేబొరేటరీల జాడ కార్పొరేట్లలో కనబడదు. హైస్కూల్, ఇంటర్మీడియట్‌లలో లక్షలు ఖర్చుపెట్టిన విద్యార్థి ఉద్యోగం వచ్చిన తరువాత ఖర్చు చేసిన ధనాన్ని ఎలా రాబట్టాలా అనే పరిస్థితి ఎదురవుతుంది. అందువల్ల విద్యా విభాగాన్ని ప్రభుత్వం రంగంలో పటిష్టపరచాల్సిన అవసరం ఉంది. అది మరచిపోయి నేటి ప్రజాప్రతినిధులే వైద్య, ఇంజనీరింగ్ పాఠశాలలను స్వంతంగా నిర్వహించుకుంటూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. ప్రభుత్వరంగ పాఠశాలలను పటిష్టపరచాల్సిన బాధ్యత ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులపైన ప్రధానంగా ఉంటుంది.
- ఎంవిఆర్ కృష్ణాజీ
జాతీయ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు
జనవిజ్ఞాన వేదిక