ఫోకస్

పడకేసిన విద్యారంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం చేపట్టిన తర్వాత ఈ మూడేళ్ళలో విద్యారంగం పూర్తిగా అటకెక్కింది. కెజి-టు-పిజి ఉచిత విద్య సంగతి దేవుడెరుగు కానీ ఉన్న విద్యారంగానే్న రాష్ట్ర ప్రభుత్వం అధ్వాన్నంగా మార్చేసింది. ఫీజుల నియంత్రణ లేదు, ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహారిస్తున్నది. టిఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే ఆ రెండు, మూడు కార్పొరేట్ విద్యా సంస్థల సంగతి తేలుస్తామని ఎన్నికలకు ముందు వాగ్దానం చేసి, అధికారం చేపట్టిన తర్వాత ఆ సంస్థలతో కుమ్మక్కై కొమ్ముకాస్తున్నది. ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు వంద బ్రాంచ్‌లకు మాత్రమే అనుమతి ఉండగా, అనధికారికంగా మరో 500 బ్రాంచ్‌లను, ఫ్రాంచైజీలను నడిపిస్తున్నాయి. ఈ సంగతి ప్రభుత్వానికి, విద్యా శాఖ ఉన్నతాధికారులకు తెలిసే జరుగుతున్నది.
ఉదాహరణకు ఎల్‌కెజిలో అడ్మిషన్ తీసుకుంటేనే సుమారు 24 వేల రూపాయల ఫీజు తీసుకుంటే ‘విద్య అమ్మకం’ కాదా? అని ప్రశ్నిస్తున్నాను. దీనిపై నియంత్రణ ఏదీ? అసలు విద్యా సంస్థల్లో ‘పేరెంట్స్ కమిటీ’లు ఏమైనట్లు? ఫీజులు పెంచాలని యాజమాన్యం భావిస్తే, అందుకు పేరేంట్స్ కమిటీ ఆమోదం తప్పనిసరి. అటువంటిది పేరెంట్స్ కమిటీలను ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. వాటి గురించి పట్టించుకునే నాధుడు లేరు. ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు చేసిన దాఖలాలు లేవు.
డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల విషయానికి వస్తే ప్రభుత్వమే కౌన్సిలింగ్‌ద్వారా విద్యార్థులను ఆ కళాశాలలకు ఎంపిక చేసి పంపించాల్సి ఉండగా, కొన్ని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు కోర్టుకు వెళ్ళి, కౌన్సిలింగ్ జాబితానుంచి మినహాయింపు తెచ్చుకున్నాయి. దీంతో ప్రభుత్వం వౌనంగా ఉంది. ప్రభుత్వం ఎందుకు కోర్టులో ఆ విద్యా సంస్థలను చాలెంజ్ చేయలేదు? దీనికి సమాధానం చెప్పాలి. ప్రభుత్వ పాఠశాలలకు సకాలంలో పుస్తకాల పంపిణీ చేయడం లేదు. ప్రభుత్వ ఇంటర్మీడియేట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశ పెడతామన్న హామీనీ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. ఇక న్యూట్రిషన్ డైట్ ఇస్తామన్న హామీ కాగితాలకే పరిమితమైంది. ఖమ్మంలో ఎస్‌సి వసతి గృహంలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మినరల్ వాటర్ లేక అస్వస్థతకు గురవుతున్నారు. సకాలంలో ఫీజు రీయంబర్స్‌మెంట్ చేయకపోవడంతో విద్యార్థులు మధ్యలోనే చదువు నిలిపి వేయాల్సిన పరిస్థితి వస్తున్నది. ఇటువంటి అనేకానేక ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వచ్చే నెలలో తాము 180 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అయినా రాష్ట్ర ప్రభుత్వంలో మార్పు రాకపోతే సత్యాగ్రహాలు చేపడతాం.
- బి. వెంకట్
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎన్‌ఎస్‌యుఐ