రాష్ట్రీయం

మానవాళికి యోగ ఒక సంపద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 21: మానవళికి యోగా ఒక సంపద అని, ఒకప్పుడు భారతదేశానికే పరిమితమైన యోగాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృషి వలన నేడు 177 దేశాల్లో ఆచరిస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలోని ఎ కనె్వన్షన్ సెంటర్‌లో బుధవారం ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొద్దిసేపు ముఖ్యమంత్రి యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 193 దేశాలకు గాను నేడు 177 దేశాలు యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం భారతదేశ విజయం..మోదీ ఘనవిజయం అని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి జూన్ 21వతేదీని యోగా దినంగా ప్రకటించడంతో ప్రపంచంలోని ప్రజలంతా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని, ప్రపంచాన్ని జయించే శక్తి విద్యార్థులకే ఉందన్నారు. యోగా మన వారసత్వ సంపద అని ప్రపంచానికి యోగాని పరిచయం చేసింది భారతీయులని పేర్కొన్నారు. జీవితంలో ప్రతి మనిషి ఏదో ఒక మానసిక ఒత్తిడికి లోను కావడం సర్వ సాధారణమని అటువంటి ఒత్తిడిల నుండి బయట పడేందుకు యోగా ఒక దిక్సూచి అని పేర్కొన్నారు. ప్రాణాయామం, మెడిటేషన్, ఫుడ్ కంట్రోల్ వల్ల శరీరాన్ని అదుపులో ఉంచుకుని ఆరోగ్యంగా, ఆనందంగా జీవించవచ్చన్నారు. సమస్యలను కూడా అనుకూలంగా మలచుకుంటే ఫలితాలు వస్తాయన్నారు. ప్రపంచానికి యోగాను కానుకగా ఇచ్చిన ఇచ్చిన మనం దానిని ఉపయోగించుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని జ్యోత్స్న చేసిన యోగా విన్యాసాలకు ముగ్ధుడైన ముఖ్యమంత్రి ఆమె పేరున ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలని అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయస్థాయిలో జ్యోత్స్న ప్రదర్శనలకు వెళ్ళే సమయంలో సాంస్కృతికశాఖ నుండి సహాయ, సహకారాలు అందించాలని సూచించారు. అనంతరం సామాన్య యోగా సాధన, యోగా విజ్ఞానం అనే పుస్తకాలను ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్, మంత్రులు కామినేని శ్రీనివాస్, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఆయుష్ కమిషనర్ రేవతి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం, మేయర్ కోనేరు శ్రీధర్, మహిళా కోఆపరేటివ్ స్టేట్ ఫైనాన్స్ చైర్‌పర్సన్ పి అనూరాధ, తదితరులు పాల్గొన్నారు.