జాతీయ వార్తలు

విపక్షాల మహాకూటమికి బీటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 21: బిజెపి రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు జెడి(యు) అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మద్దతు ప్రకటించటంతో ప్రతిపక్ష మహాకూటమి కుప్పకూలింది. పాట్నాలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నివాసంలో జరిగిన జెడి(యు) సమావేశంలో కొత్త రాష్టప్రతి ఎంపిక గురించి చర్చించారు. బిహార్ గవర్నర్‌గా పనిచేసిన వ్యక్తి రాష్టప్రతిగా ఎన్నికయ్యే అవకాశం కలిగినందున ఆయనకు పూర్తి మద్దతు ఇవ్వాలని జెడి(యు) నిర్ణయించింది. దీనితో కోవింద్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షం కూప్పకూలింది. బిజెపి అభ్యర్థికి జెడి(యు) మద్దతు లభించకుండా చూసేందుకు కాంగ్రెస్, వామపక్షాలు తీవ్రంగా ప్రయత్నించాయి. సోనియా గాంధీ ఆదేశం మేరకు మంగళవారం పాట్నా వెళ్లిన రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్ నితీశ్ కుమార్‌ను ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ప్రతిపక్ష సమైక్యత కోసమైనా కోవింద్‌కు మద్దతు ప్రకటించకూడదని నితీశ్‌కు ఆజాద్ విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. నితీశ్ మాత్రం ఈ విషయంలో తన వైఖరిని మార్చుకోవటం సాధ్యం కాదని స్పష్టం చేశారని ఆంటున్నారు. తమ రాష్ట్రంలో గవర్నర్‌గా పని చేసిన దళితుడు రాష్టప్రతి పదవి చేపట్టే అవకాశం వస్తే తాము మద్దతు ఇవ్వకుండా ఎలా ఉంటామని నితీశ్ కుమార్ ఆయనను ప్రశ్నించినట్లు తెలిసింది. అజాద్‌తో చర్చలు జరిపిన అనంతరం నితీశ్ కుమార్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఫోన్‌చేసి తన నిర్ణయాన్ని తెలియజేశారని జెడి(యు) వర్గాలు వెల్లడించాయి. రామ్‌నాథ్ కోవింద్‌కు సమాజ్‌వాదీ పార్టీ అధినాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఇదివరకే మద్దతు ప్రకటించారు. బిఎస్‌పి అధ్యక్షురాలు మాయావతి కూడా కోవింద్‌కు మద్దతు ప్రకటించటంతోపాటు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించటం న్యాయం కాదని ప్రతిపక్షాలకు హితవు చెప్పారు. ప్రతిపక్షాలకు చెందిన పలువురు ఎంపీలు కోవింద్‌కు తమ మద్దతు ప్రకటించారు. సమాజ్‌వాదీ, బిస్‌పి, జె.డి(యు) కోవింద్‌కు మద్దతు ప్రకటించటంతో బిజెపి అభ్యర్థిని వ్యతిరేకించాలన్న కాంగ్రెస్, వామపక్షాల వ్యూహం నీరుకారిపోయిందని అంటున్నారు. సోనియా అధ్యక్షతన గురువారం 18 ప్రతిపక్ష పార్టీల సమావేశం జరుగనున్న నేపథ్యంలో నితీశ్ కుమార్ బిజెపి అభ్యర్థికి మద్దతు ప్రకటించటం చర్చనీయాంశంగా మారింది. నితీశ్‌కుమార్, మాయావతి, ములాయం సింగ్ యాదవ్ జారిపోవటంతో ప్రతిపక్షం రాష్టప్రతి పదవికి పోటీ చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్టప్రతి అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్‌ను రంగంలోకి దించే అవకాశాలున్నాయి.