జాతీయ వార్తలు

దివ్యాంగులకు వరాల జల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 21: బుద్ధిమాంద్యం, మానసిక రుగ్మత, మేధోపరమైన వైకల్యం, యాసిడ్ దాడి బాధితులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ముసాయిదాను కేంద్ర సిబ్బంది, శిక్షణా విభాగం సిద్ధం చేసింది. ఇలాంటి వారికి రిజర్వేషన్లు, ప్రమోషన్లతో పాటు ఉద్యోగాల్లో చేరేందుకు వయసు పరమైన నిబంధనలనూ సడలించాలని ఈ విభాగం భావిస్తోంది. కానీ, దివ్యాంగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలన్న అంశం సుప్రీం కోర్టు పరిశీలనలో ఉన్నందున కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన సరికొత్త వివాదాన్ని రేకెత్తించే అవకాశం కనిపిస్తోంది. కాగా, ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి ఎ, బి, సి, డి గ్రూపు మొత్తం పోస్టుల్లో నాలుగు శాతం చొప్పున నిర్దేశిత దివ్యాంగత్వం కలిగిన వారికి ఉద్యోగాలను ప్రత్యేకించాలనీ ముసాయిదాలో ప్రతిపాదించినట్టు సిబ్బంది విభాగం తెలిపింది. అంటే అంధత్వం, చూపు మందగించడం, చెవిటితనం, పెద్దగా వినిపించక పోవడం, బుద్ధి మాంద్యం వంటివాటిని ప్రభుత్వ విభాగాల్లో రిజర్వేషన్లకు అర్హమైన వాటిగా గుర్తించింది. వీటితోపాటు యాసిడ్ దాడి బాధితులు, మేధోపరమైన లోపం, అంధత్వం, మూగత్వం కలిసిన వారికీ ఒక శాతం రిజర్వేషన్లు కల్పించాలని సూచించింది. ఏయే వైకల్యానికి ఎంత పరిమాణంలో రిజర్వేషన్లు కల్పించాలన్న దానిపై ఈ విభాగం స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించింది.